»   » బాలయ్య ‘డిక్టేటర్’కు ఓవర్సీస్‌లో భారీ డిమాండ్

బాలయ్య ‘డిక్టేటర్’కు ఓవర్సీస్‌లో భారీ డిమాండ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన ‘డిక్టేటర్' చిత్రాన్ని జనవరి 14న గ్రాండ్ గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను కొనేందుకు అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తి చూపుతున్నారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... ఓవర్సీస్ మార్కెట్లో ఈ చిత్రానికి భారీ డిమాండ్ ఏర్పడింది.

ఈచిత్రం ఓవర్సీస్ రైట్స్ దక్కించుకునేందుకు పలువురు డిస్ట్రిబ్యూటర్లు రూ. 4 కోట్ల చెల్లించేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం. అయితే పెద్ద డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడుతుండటంతో ఇంకా డీల్ ఫైనల్ కాలేదు. ఇప్పటికే ఈ చిత్రం నైజాం రైట్స్ దిల్ రాజు దక్కించుకున్న సంగతి తెలిసిందే. మరో వైపు సీడెడ్ రైట్స్ సాయి కొర్రపాటి కొనుగోలు చేసారు.


Dictator overseas rights

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం డిక్టేటర్. ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సినిమాను సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తుంది.


ఆనంద్ రామరాజు, సుమన్‌, పవిత్రాలోకేష్‌, నాజర్‌, వెన్నెల కిషోర్‌, పృథ్వీ, కాశీ విశ్వనాథ్‌, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, హేమ, కబీర్‌, విక్రమ్‌ జీత్‌,అజయ్‌ తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి ఫైట్స్‌: రవివర్మ, ఆర్ట్‌: బ్రహ్మకడలి, ఎడిటర్‌: గౌతంరాజు, మ్యూజిక్‌: ఎస్‌.ఎస్‌.థమన్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, రచన: శ్రీధర్‌ సీపాన, మాటు: ఎం.రత్నం, కథ, స్క్రీన్‌ప్లే: కోనవెంకట్‌,గోపిమోహన్‌, నిర్మాత: ఈరోస్‌ ఇంరట్నేషనల్‌, కో ప్రొడ్యూసర్‌, దర్శకత్వం: శ్రీవాస్‌.

English summary
Huge demand for Nandamuri Balakrishna’s Dictator overseas rights. Distributors are ready to shell at least 4 crores to bag them.
Please Wait while comments are loading...