»   » అల్లు అర్జున్ ముందే ఎక్స్ పెక్ట్ చేశాడా!

అల్లు అర్జున్ ముందే ఎక్స్ పెక్ట్ చేశాడా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

'వరుడు సినిమా ఫలితాన్ని అల్లు అర్జున్ ముందే ఊహించాడా? ఈ చిత్రం అటు ఇటుగా అయ్యే అవకాశాలే ఎక్కువని నిర్మాత ముందే గ్రహించాడా? అంటే అవుననే అంటున్నారు ఫిలింనగర్ వర్గాలు. అయితే సినిమా విడుదలకి ముందు రోజు జరిగిన ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ అన్న మాటల్నే తీసుకుంటే..అతనిలో ఏదో ఒక మూల వొక్కింత అనుమానమయితే ఉందన్న సంగతి అర్ధమవుతుంది. 'ఈ సినిమా హిట్టయితే ఆ క్రెడిట్ అంతా గుణశేఖర్ కే దక్కుతుంది. ఇది ప్లాప్ అయితే మా యూనిట్ అందరిదీ బాద్యత!

అంటే బన్నీ మాటల్లో అంతరార్థం ఏమిటో మరుసటి రోజే తేలిపోయింది. ఏ సినిమా గురించి అయినా చాలా కాన్ఫిడెంట్ గా ఉండే బన్నీ తన సినిమా ప్లాప్ అవడానికి కూడా అవకాశాలున్నాయని చెప్పడంతోనే 'వరుడు" డౌటన్న సంగతి అర్థమయింది. దానికితోడు బన్నీ సినిమాలకి ఓపెనింగ్స్ కంటే లాంగ్ రన్ కోసం చూసుకోవడం రివాజుగా జరుగుతోంది. కానీ 'వరుడు" సినిమాకి మాసివ్ రిలీజ్ ప్లాన్ చేశారు. ఇదంతా చూస్తే, ఎంత త్వరగా వస్తే అంత త్వరగా అందినంత దండుకోవడం మంచిదనే ఫార్ములా అప్లయ్ చేసినట్టు అనిపించింది. ఏదేమైనా అనుమానాలు ఉన్నట్లే అవే నిజమయ్యాయి.

గుణశేఖర్ నిర్వచనంలో పూర్వకాలపు పెళ్ళి తంతు 5 రోజులు జరిగేవి కానీ ఆ వేడుక ఐదు నిమిషాలకే పరిమితమైంది అన్న గుణశేఖర్ పద్దతీ పాడూ లేకుండా సినిమాని తెరకెక్కించాడనీ, చేసిన ప్రచారానికీ, తీసిన సినిమాకీ పొంతనే లేదని సినిమా పై కామెంట్లు వచ్చిపెడ్డున్నాయి. 5 రోజుల చూపించాలన్న పెళ్ళి సందడి కాస్త ఐదు రోజులు కాదు కదా మూణ్ణాళ్ల ముచ్చటయ్యేలా ఉంది కాబోలు. అందుకే సినిమా టాక్ ని పక్కన పడేసి, సినిమాని ప్రమోట్ చేసేందుకు అల్లు అర్జున్ రంగంలోకి దిగి, తొలి రోజు వసూళ్ళ ను ప్రకటిస్తున్నాడని మనం సరిపెట్టుకోవాల్సిందేనేమో!

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu