»   » అంతా షాక్ :ఓంపురి.. కి ఏడాది ముందే తెలుసా..మరణిస్తానని?

అంతా షాక్ :ఓంపురి.. కి ఏడాది ముందే తెలుసా..మరణిస్తానని?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి: బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు ఓంపురి(66) ఈరోజు ఉదయం గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే తాను చనిపోతానన్న విషయం ఓంపురికి ముందే తెలుసట. ఆయన తన మరణం గురించి 2015లో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన ఆడియో ఒకటి బయటికి వచ్చింది.

ఆడియోలో ఆయన.. ''నాకు చావంటేభయంలేదు కానీ అనారోగ్యానికి గురవడం అంటే భయం. ఆరోగ్యం పాడైమంచాన పడి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పక్కవారిపై ఆధారపడే వారిని చూసినప్పుడల్లా నాకూ అదే పరిస్థితి వస్తుందేమోనన్న భయం ఉండేది కానీ చావంటే భయం లేదు. చావును కూడా ఎవరూ ముందే వూహించలేరు. ఎప్పుడో ఒకప్పుడు నిద్రలో కన్నుమూస్తాం. ఓంపురి నిన్నరాత్రి 7.22 నిమిషాలకు కన్నుమూశారు.. అన్న వార్త ఉదయం ప్రజలకు తెలుస్తుంది'' అని చెప్పారు.

ఓంపురి యధాలాపంగా అన్నట్లుగానే ఆయన హఠాత్తుగా మరణించారు. లెజెండరీ నటుడు ఇక లేరన్న బాధ ఉన్నా.. సంతోషించాల్సిందేంటంటే.. ఆయన కోరుకున్నట్లు ఎలాంటి అనారోగ్యానికి, బాధకు గురికాకుండా ప్రశాంతంగా కన్నుమూశారని బాలీవుడ్ అంటోంది.

Did Om Puri know about his death?

అలాగే మృతికి ముందు రోజు బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ.... " నేను ఈ ప్రపంచాన్ని వదిలిన తర్వాత నటుడుగా నేను ఏం కాంట్రబ్యూట్ చేసానన్న విషయం యంగ్ జెనరేషన్ ముఖ్యంగా ఫిల్మ్ స్టూడెంట్స్ నా సినిమాలు ద్వారా చూస్తారు." అని వ్యాఖ్యానించారు. అదీ నిజం జరగబోతోంది.

ఓంపురి(66) శుక్రవారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో సృగృహంలోనే ప్రాణాలు విడిచారు. బాలీవుడ్‌తో పాటు పలు హాలీవుడ్‌, పాకిస్థాన్‌ చిత్రాల్లో ఆయన నటించారు. తెలుగులో 'అంకురం' చిత్రంలో నటించారు. అద్భుత నటనతో పలుసార్లు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నారు. ఓంపురి మరణంతో బాలీవుడ్‌ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.

ఓంపురి హరియాణాలోని అంబాలా ప్రాంతంలో పంజాబీ కుటుంబంలో అక్టోబర్‌ 18, 1950లో జన్మించారు. పుణెలోని ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూల్‌ ఆఫ్‌ ఇండియాలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు.

1976లో మరాఠీ చిత్రం 'ఘాశీరామ్‌ కొత్వాల్‌'తో సినీరంగ ప్రవేశం చేశారు. 1982లో 'ఆరోహణ్‌', 1984లో 'అర్ధ్‌ సత్య' చిత్రాలకు గానుఆయన జాతీయ ఉత్తమనటుడు అవార్డులు అందుకున్నారు. 1990లో భారత ప్రభుత్వం నుంచి 'పద్మశ్రీ' పురస్కారం పొందారు. ఎనిమిది సార్లు ఫిలింఫేర్‌ అవార్డులు అందుకున్నారు.
ప్రముఖుల సంతాపం

ఓంపురి మృతి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. నాటకాలు, సినిమాల్లో ఆయన సినీ ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు. సోషల్‌మీడియా ద్వారా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.ఇది షాకింగ్‌ న్యూస్‌ అని, ఓ గొప్ప, తెలివైన నటుడిని సినీ రంగం కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు... అనుపమ్‌ఖేర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, ఖుష్బూ, రితేష్‌ దేశ్‌ముఖ్‌ తదితరులు ట్విట్టర్‌ ద్వారా సంతాపం తెలిపారు.

English summary
Om Puri said: “My contribution as an actor will be visible once I leave this world and the young generation, especially film students will watch my films.”.Veteran actor Om Puri passed away in Mumbai, he was found dead at his home on Friday morning. He was 66.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu