»   » అక్కా చెల్లెల్లిద్దరూ ఇక బాలీవుడ్ కి బై బై అన్నట్టేనా??? అసలెలా జరిగిందంటే

అక్కా చెల్లెల్లిద్దరూ ఇక బాలీవుడ్ కి బై బై అన్నట్టేనా??? అసలెలా జరిగిందంటే

Posted By:
Subscribe to Filmibeat Telugu

బంగారం సినిమాలో పవన్‌తో కలిసి నటించిన మీరా చోప్రా సినీ రంగంలో సక్సెస్‌ కాలేకపోయింది. బాలీవుడ్‌లో ఇప్పటికే ఒకటీ అరా సినిమాల్లో చేసినా మీరా చోప్రాకి.. అక్కడా పరిస్థితి ఏమంత గొప్పగా లేదు. గ్లామర్‌ విషయంలో మొహమాటాలేమీ లేవుగానీ, దర్శక నిర్మాతల్ని తన అహంకారంతో వేధింపులకు గురిచేయడమే మీరా చోప్రా బ్యాడ్‌ హ్యాబిట్‌ అనీ, అదే ఆమెను హీరోయిన్‌గా ఎదగనీయకుండా చేస్తోందన్న విమర్శలున్నాయి.

తమిళ సినిమాలతో నటిగా కెరీర్‌ ప్రారంభించిన మీరా చోప్రా, ప్రస్తుతం బాలీవుడ్‌లో మకాం వేసింది. బాలీవుడ్‌లో ఒకటీ అరా సినిమాలతో కాస్తంత బిజీగానే వున్న మీరా చోప్రా, బాలీవుడ్‌ నటి ప్రియాంకా చోప్రాకి కజిన్‌. ఆ సంగతి తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తున్నప్పుడు పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదనుకోండి.. అది వేరే విషయం.

 Did Priyanka Chopra help sister Meera bag a Canadian fantasy drama

ఇక, బికినీలో కంఫర్టబుల్‌గా ఫీల్‌ అవలేనంటోన్న మీరా చోప్రా, సన్నివేశం డిమాండ్‌ చేస్తే, బికినీలో కన్పించడానికి ఇబ్బందేమీ లేదంటూ బోల్డ్ స్టేట్మెంట్లిచ్చినా మీరా వైపు చూడలేదు దర్శకులు. బికినీ గ్లామర్‌ని మించిపోయేలా, ఆమె బాలీవుడ్‌కి వెళ్ళాక పలు ఫొటోసెషన్లకు పోజిచ్చింది. బాలీవుడ్‌కి వెళ్ళేందుకూ ఆమె అందాల ప్రదర్శననే ఆశ్రయించింది. అప్పట్లో ఆమె ఫొటోలకు ఇచ్చిన పోజులు ఇప్పటికీ హాట్‌ హాట్‌గా సర్కులేట్‌ అవుతున్నాయి కానీ అవకాశాలు మాత్రం రాలేదు.

ఇక దాదాపు నటన మీద ఆశలు వదిలేసుకుంటోన్న దశలో ఆమెకి ప్రియాంక వల్ల ఒక కెనడియన్‌ టీవీ షోలో ఛాన్స్‌ వచ్చింది. ఇప్పుడు హాలీవుడ్‌లో ప్రియాంక హవా నడుస్తోన్న సంగతి తెలిసిందే. టెలివిజన్‌ సిరీస్‌ నుంచి ఆమె ఇప్పుడు బేవాచ్‌ చిత్రంలో నటించే లెవల్‌కి ఎదిగింది. ఇటీవల ప్రియాంకని మీరా కలిసిందట. ఆ సందర్భంలో ఏం చేస్తున్నావని అడిగితే, మీరా దగ్గర చెప్పుకోడానికి ఏమీ లేకుండా పోయిందట. వెంటనే తన మేనేజర్‌ ద్వారా ఒక కెనడియన్‌ టీవీ కంపెనీని కాంటాక్ట్‌ చేయించి అప్పటికప్పుడు ఆ సిరీస్‌లో మీరాకి ఒక రోల్‌ ఇప్పించిందట.

అక్క ఇచ్చిన ఎంకరేజ్‌మెంట్‌తో మీరా ఇప్పుడు అమెరికా ప్రయాణమవుతుంది. అన్నీ కలిసి వస్తే అక్కడే మరిన్ని టీవీ సిరీస్‌లో, కాలం కలిసి వస్తే ఒక హాలీవుడ్‌ సినిమాలోనో ల్యాండ్‌ అయిపోతుందేమో. ప్రియాంక కజిన్‌ అనే ట్యాగ్‌ ఇండియాలో పని చేయక పోయినా హాలీవుడ్ లో మాత్రం బాగానే ఉపయోగపడేలానే ఉంది మరి.

English summary
Meera lands Canadian television show with Priyanka's help; to leave for US soon
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu