»   » ఇదివ్వాల కొత్తగా చేసిందేం కాదుగా: కాపీ "మహానుభావుడు" థమన్

ఇదివ్వాల కొత్తగా చేసిందేం కాదుగా: కాపీ "మహానుభావుడు" థమన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎస్ఎస్ థమన్...తెలుగులో అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అవడంతో పాటు ఎక్కువ సినిమాలకు సంగీతం అందించడం.. మహేష్ బాబు, రవితేజ, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో పని చేసే అవకాశం దక్కించుకున్న మ్యూజిక్ డైరెక్టర్. అయితే థమన్‌ ఇతర భాషా చిత్రాల్లోని ట్యూన్స్ కాపీ చేస్తాడనే ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తూనే ఉన్నాయి.

ట్యూన్స్‌ను లిఫ్ట్ చేయడం

ట్యూన్స్‌ను లిఫ్ట్ చేయడం

అతి తక్కువ టైమ్‌లో ఫాస్ట్‌గా ట్యూన్స్ కడుతూ దర్శక, నిర్మాతలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే సంగీత దర్శకుడు థమన్.. అయితే ట్యూన్స్‌ను లిఫ్ట్ చేయడంలో కూడా థమన్ ఘటికుడని చాలా సార్లు ప్రూవ్ అయింది. టాలీవుడ్‌లో ఫ్రీక్వెంట్‌గా కాపీ ట్యూన్స్ కొట్టేది కూడా థమనే అని చెప్పుకుంటుంటారు. తాజాగా ‘మహానుభావుడు' సినిమా కోసం థమన్ కంపోజ్ చేసి విడుదల చేసిన తొలి పాట కూడా కాపీ అనే వినిపిస్తోంది.

మహానుభావుడవేరా......

మహానుభావుడవేరా......

శర్వానంద్ మహానుభావుడు సినిమాకు మ్యూజిక్ అందించాడు థమన్. ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. లేటెస్ట్ థమన్ ఓ ట్యూన్ ను మారుతి కోసం అందించాడు. మంచి ట్యూన్ లు రాబట్టుకోగలడని పేరున్న మారుతి ఈ ట్యూన్ ను తన మహానుభావుడు సినిమా కోసం థమన్ నుంచి దగ్గర వుండి రాబట్టుకున్నాడు. గీతా మాధురి పాడిన 'మహానుభావుడవేరా' అనే పల్లవితో ప్రారంభం అవుతుంది.

కేవి మహాదేవన్ ట్యూన్

కేవి మహాదేవన్ ట్యూన్

పాత పాట పల్లవి ట్యూన్‌ను యాజ్ టీజ్‌గా థమన్ కాపీ కొట్టాడని అంటున్నారు. ఇంతకీ థమన్ ఈ పల్లవిని ఎక్కడి నుంచి పట్టుకువచ్చాడంటే, గతంలో కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘శుభోదయం'లోని మహా సంగీత దర్శకుడు కేవి మహాదేవన్ ట్యూన్ చేసిన 'గంధము పూయరుగా.. పన్నీరు గంధము పూయరుగా' అన్న పల్లవి నుంచి లేపేసాడన్నమాట వినిపిస్తోంది.

ఇది థమన్ కి కొత్తకాదు

ఇది థమన్ కి కొత్తకాదు

మహానుభావుడులో టైటిల్ సాంగ్‌ను కొత్త గీత రచయిత కృష్ణకాంత్ రాయగా గీతా మాధురి పాడింది. అయితే పాట పల్లవి వరకే థమన్ కాపీ కొట్టాడని, మిగిలిన పాట మొత్తం అతడి క్రియేటివిటీనే అని అంటున్నారు. అయితే ఇది థమన్ కీ కొత్తకాదూ, ట్రోలర్స్ కీ కొత్తకాదు గతం లో కొన్ని ఇటాలియన్, సౌత్ అమెరికన్ మ్యూజిక్ ఆల్బమ్స్ నుంచి మక్కి కి మక్కీ లేపేసిన పాటలు కోకొల్లలు.

English summary
In the movie, "Ghandhamu Puyaru ga" composed by K.V. Mahadevan has been the most popular and that tune is said to be copied by Thaman for Mahanubhavudive song.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu