»   » ఇద్దరు అగ్రహీరోలు ఒకే సినిమాలో: మళ్ళీ పాతరోజులు రానున్నాయా??

ఇద్దరు అగ్రహీరోలు ఒకే సినిమాలో: మళ్ళీ పాతరోజులు రానున్నాయా??

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ సినిమాల్లో హీరోలు పెద్దగా ఈగోలకు పోరు అన్న టాక్ ఎప్పటి నుంచో ఉంది. పాత్ర చిన్నదా పెద్దదా అని కూదా చూడకుండా వారి చిత్రాల్లోనే కాకుండా ఇతరుల చిత్రాల్లో కూడా నటిస్తుంటారు. ఏమాత్రం భేషజాలకు పోకుండా ప్రముఖుల హీరోలతో సైతం నటిస్తూ అభిమానులను మెప్పిస్తుంటారు. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్..షారూఖ్ ఖాన్ త్రయం నటించారంటే అభిమానులు ఆనందానికి అవధులు ఉండవు. గతం లోనూ ఈ ఇద్దరు కలిసి నటించిన సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. వాటిల్లో కరణ్ అర్జున్ లాంటి సూపర్ హిట్ లు కూడా ఉన్నాయి. తాజాగా 'సల్లూ భాయ్' నటిస్తున్న 'ట్యూబ్ లైట్' చిత్రంలో 'షారూఖ్' ఓ ముఖ్యమైన పాత్ర పోషించాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

షారూఖ్ ఖాన్ కీలకమైన అతిథి పాత్రలో

షారూఖ్ ఖాన్ కీలకమైన అతిథి పాత్రలో

ఈ సినిమా నిర్మాత, నటుడు సోహైల్ ఖాన్, సినిమా విశేషాలను అభిమానులతో పంచుకున్నాడు. తన అభిమాన దర్శకుడైన కబీర్ ఖాన్ తో కలిసి పనిచేయటం చాలా ఆనందంగా ఉందన్నాడు. అదే సమయంలో ఆసక్తికరమైన విషయమొకటి వెల్లడించాడు.సల్మాన్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కీలకమైన అతిథి పాత్రలో కనిపిస్తున్నాడట.

ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో

ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో

కథను మలుపు తిప్పే ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో షారూఖ్ కనిపించబోతున్నట్టుగా వెల్లడించాడు సోహైల్. అంతేకాదు ఆ పాత్రకు షారూఖ్ ఇమేజ్ చాలా హెల్ప్ అవుతుందని అందుకే షారూఖ్ ను ఆ పాత్రకు ఒప్పించినట్టుగా తెలిపాడు. ఈద్ సీజన్ లో సూపర్ హిట్ రికార్డ్ ఉన్న సల్మాన్ మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేస్తాడని భావిస్తున్నారు.

ట్రైలర్ లో కూడా షారూఖ్

ట్రైలర్ లో కూడా షారూఖ్

ట్రైలర్ లో కూడా షారూఖ్ కనిపించాడంటూ చెప్పటం తో మళ్ళీ ట్రైలర్ని పరీక్షగా చూసిన జనం షారూఖ్ కనిపించే షాట్ ని చూసి కన్ ఫర్మ్ చేసుకుని హ్యాపీగా ఫీలౌతున్నారు. సినిమాకు సంబంధించిన లుక్స్ ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. సోహైల్ ఖాన్, చైనా నటి చూచూ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ట్యూబ్ లైట్ కీ ఈద్

ఇదిలా ఉంటే ఈ చిత్రం వ్యక్తిగత ఎమోజి కలిగిన తొలి బాలీవుడ్ చిత్రంగా గుర్తింపు పొందడం విశేషం. ఈ విషయాన్ని కబీర్ ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. ట్విట్టర్ లో 'ట్యూబ్ లైట్ కీ ఈద్' అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేసినప్పుడు ఈ ఎమోజీ కనిపిస్తుంది. సల్మాన్ మెడకు బూట్లు ధరించి సెల్యూట్ చేస్తూ బొమ్మ రూపంలో కనబడుతాడు. భారత్ - చైనా సరిహద్దు నేపథ్యంలో సినిమా ఉంటుందని, రంజాన్ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

English summary
the Tubelight teaser also had a glimpse of SRK, but it wasn't very clear. Now Shah Rukh's silhouette can be clearly seen in the Tubelight trailer, leaving his fans even more excited.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu