»   » పవన్ కళ్యాణ్‌తో ‘బజరంగీ...’: దిల్ రాజు వివరణ

పవన్ కళ్యాణ్‌తో ‘బజరంగీ...’: దిల్ రాజు వివరణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘బజరంగీ భాయిజాన్' సినిమా బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని సౌత్ లో రీమేక్ చేయడానికి పలువురు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రానికి సంబంధించిన రీమేక్ రైట్స్ దక్కించుకున్నారని, తెలుగులో ఈ స్టోరీ బాగా వర్కౌట్ అవుతుందని, పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటే హరీష్ శంకర్ దర్శకత్వంలో తెలుగులో రీమేక్ చేద్దామనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

Dil Raju about 'Bhajrangi Bhaijaan' remake

అయితే ఈ వార్తలపై దిల్ రాజు స్పందించారు. తాను ఆచిత్రం రీమేక్ రైట్స్ తీసుకోలేదని స్పష్టం చేసారు. దిల్ రాజు రీమేక్ రైట్స్ ఇంకా తీసుకోలేదని చెప్పారు కానీ, రీమేక్ ఆలోచన లేదని మాత్రం చెప్పలేదట. దీంతో దిల్ రాజు రీమేక్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు నమ్ముతున్నారు కొందరు అభిమానులు.

English summary
Producer Dil Raju has clarified that he hasn't acquired the rights of 'Bhajrangi Bhaijaan'. Well, he did not deny about the possible remake either.
Please Wait while comments are loading...