»   » మొదట భయపడ్డాను కానీ... దిల్ రాజు

మొదట భయపడ్డాను కానీ... దిల్ రాజు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ సినిమా గురించి చెప్పినపుడు కొంచెం భయపడ్డాను. అయితే ఆ తర్వాత రవి యాదవ్‌ ఎఫర్ట్‌ చూశాక ధైర్యం వచ్చింది అంటున్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. ఆయన తాజాగా చేస్తున్న 'మరో చరిత్ర' రీమేక్ ప్రచారంలో భాగంగా మీడియాను కలిసారు. ఈ సందర్భంగా పై విధంగా మాట్లాడుతూ.. విజువల్‌గా, టెక్నికల్‌గా ఎక్స్‌ట్రార్డినరీగా తీశాడు. కమల్‌హాసన్‌, సరితలతో పోల్చకుండా చూస్తే వరుణ్‌సందేశ్‌, అనిత ఈ జనరేషన్‌కు నచ్చేట్టుగా పెర్‌ఫార్మ్‌ చేశారు. ఈ సమ్మర్‌కి ది బెస్ట్‌ లవ్‌స్టోరీ అవుతుంది అని చెప్పుకొచ్చారు. అలాగే ... 'మరో చరిత్ర' ఒక లెజండరీ ఫిలిం. అలాంటి సినిమాను మళ్లీ చేయడమంటే సాహసమే. ఏ మాత్రం చిన్న తప్పు చేసినా విమర్శలు చుట్టుముడతాయి అన్నారు. ఇక సినిమా ఏం రేంజిలో హిట్టవుతుందన్న విషయం చెపుతూ... థియేటర్లన్నీ కాలేజీలుగా మారతాయి. ఈ నెల 25న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. సాధారణంగా సినిమా విడుదల తర్వాత విజయ యాత్రలకు వెళుతుంటారు. కానీ, మేం ప్రచారవ్యూహంలో భాగంగా ఈ నెల 18 నుంచి 25 వరకూ రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాలకు వెళుతున్నాం' అని తెలిపారు నిర్మాత 'దిల్‌'రాజు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, మ్యాటినీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'మరో చరిత్ర'. ఈ చిత్రానికి సంబంధించిన వెబ్‌సైట్‌ను హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu