For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆంధ్రాలో నడిచినట్లు తెలంగాణలో కాదు, ఆ కేసు వేసిందే మంచిది: దిల్ రాజు

  |

  తెలుగు చిత్ర పరిశ్రమకు ఎప్పుడు ఏం కావాలన్నా తెలంగాణ ప్రభుత్వం పూర్తి సపోర్ట్ చేస్తోందని, ఇపుడు క్యాబినెట్ ఫైనల్ అయిన తర్వాత ఎవరు సినిమాటోగ్రఫీ మినిస్టర్‌గా వస్తారో చూడాలి, కేసీఆర్ ప్రభుత్వం వల్ల గత ఐదేళ్లలో చిత్ర పరిశ్రమకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు.

  ఆంధ్రాలో ఇచ్చినట్లే తెలంగాణలో కూడా కొన్ని సందర్భాల్లో 5 షోలకు అనుమతి ఇస్తున్నారు. అయితే తెలంగాణలో అదనపు షోల వల్ల ఏమీ లాభం ఉండదు. ఆంధ్రాలో 5 షోలు వర్కౌట్ అవుతాయి. తెలంగాణలో కావని స్పష్టం చేశారు.

  తెలంగాణ ప్రజలు అలా చూడరు

  తెలంగాణ ప్రజలు అలా చూడరు

  తెలంగాణ జనాలకు 8 గంటలకు సినిమాలకు వెళ్లే అలవాటు లేదు. 11 గంటల తర్వాతే వెళతారు. స్టార్ హీరోల సినిమాలైనా అదే పరిస్థితి. అదే ఆంధ్రాలో 6 గంటలకు షోలు పడిపోతాయి, జనాలు చూడటానికి వస్తారు. హైదరాబాద్ కొన్ని చోట్లు, ఖమ్మంలో ఒక థియేటర్ తప్ప తెలంగాణలో బెనిఫిట్ వర్కౌట్ కావు. ఆంధ్రాలో ప్రతి జిల్లాలో బెనిఫిట్ షోలు పడతాయని దిల్ రాజు స్పష్టం చేశారు.

  దేవుడి దయ వల్ల ఎవరో కేసు వేయడంతో...

  దేవుడి దయ వల్ల ఎవరో కేసు వేయడంతో...

  గవర్నమెంట్ దృష్టికి ఇండస్ట్రీ సమస్యలు తీసుకెళ్లడానికి సమిష్టిగా ఒకరి నాయకత్వంలో వెళ్లే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు దిల్ రాజు స్పందిస్తూ... ఒకసారి నన్ను ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్‌గా ఉండాలని కోరితే ఉంటానన్నారు. కానీ నాకు వ్యతిరేకంగా రామ్మోహన్ రావు అనే వ్యక్తిని నిలబెట్టారు. నేను పోటీ చేయాలని అనుకోలేదు. మీరు అడిగారు కాబట్టి ఉంటానన్నాను అంటే... ప్రొడ్యూసర్స్ అందరూ మన వైపే ఉన్నారు అంటూ ఎలక్షన్ మూడ్ క్రియేట్ చేశారు. నాకు తెలియకుండానే దాంట్లోకి ట్రావెల్ అయ్యాను. దేవుడి దయవల్ల ఎన్నికల మీద ఎవరో కేసు వేసి అవి జరుగకుండా ఆపేశారు.

  మేము ముంబై వెళ్లిపోతే ఎవ్వడితో మాటపడక్కలేదు, అలాంటి సినిమాలెందుకు?: దిల్ రాజు

  అసలు ఎలక్షన్ ఎందుకు?

  అసలు ఎలక్షన్ ఎందుకు?

  అసలు ఎలక్షన్స్ ఎందుకు? అనేది నా ప్రశ్న. ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కు ఒక ప్రపోజల్ చెప్పాను. రన్నింగ్ ప్రొడ్యూసర్లు 12 మందిని ఈసీ మెంబర్లను చేయండి, అందులో నుంచి ఒక ప్రొడ్యూసర్‌ను ప్రెసిడెంటుగా పెట్టేయండి. రన్నింగ్ ప్రొడ్యూసర్లకు మాత్రమే సమస్యలు తెలుస్తాయి. వారే మాట్లాడాలి. ఈసీ మెంబర్ రెండేళ్లు సినిమా తీయలేదంటే నెక్ట్స్ ఆయన ఉండకూడదు. 2 సంవత్సరాల్లో నువ్వు సినిమా తీసినట్లయితే అక్కడ కూర్చో. అసలు ఆ బాడీ స్ట్రాంగ్ ఉంటే అంతా బావుంటుంది. అది సాధ్యం కావడం లేదు.

  గ్రూఫులు కట్టి అరుచుకోవడం తప్ప...

  గ్రూఫులు కట్టి అరుచుకోవడం తప్ప...

  కౌన్సిల్ అంటే అందరి కోసం కష్టపడే పనే కదా... ఇది రాజకీయం కాదు. ఇండస్ట్రీలో సమస్యలు పరిష్కారం కావాలంటే ఏకగ్రీవంగా కౌన్సిల్ ఎన్నిక జరుగాలి. ఈ విషయంలో పోటీ ఎందుకు? పోటీ ఉంటే గ్రూపులు తయారవుతాయి... వాడి మీద వీడు.. వీడి మీద వాడు.. రెండు గ్రూఫులు అరుచుకోవడాలు తప్ప ఏమీ ఉండదని దిల్ రాజు స్పష్టం చేశారు.

  దాసరి ఉన్నపుడు పరిస్థితి వేరు...

  దాసరి ఉన్నపుడు పరిస్థితి వేరు...

  గతంలో దాసరి నారాయణరావుగారు ఉన్నపుడు... ఏమిటీ ప్రాబ్లం అని పిలిపించి అడిగేవారు. ఇపుడు అలాంటి పరిస్థితి లేదని దిల్ రాజు చెప్పుకొచ్చారు.

  English summary
  Dil Raju about Telangana and AP people mind set on movies. Dil Raju is a National Award-winning Indian film producer and distributor, known for his works exclusively in Telugu cinema, He owns the production house Sri Venkateswara Creations.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X