»   » నాని నేను లోక‌ల్ రిలీజ్ డేట్ ప్రకటించిన దిల్ రాజు

నాని నేను లోక‌ల్ రిలీజ్ డేట్ ప్రకటించిన దిల్ రాజు

Posted By:
Subscribe to Filmibeat Telugu

నేచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తిసురేష్ హీరోయిన్‌గా, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో త్రినాథ రావు నక్కిన ద‌ర్శ‌క‌త్వంలో శిరీష్ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం నేను లోక‌ల్‌.యాటిట్యూడ్ ఈస్ ఎవిరీథింగ్‌ అనేది క్యాప్ష‌న్‌. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. పాట‌లు ఇటీవ‌ల విడుద‌లైన సంగ‌తి తెలిసిందే.

నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - మా నేను లోకల్ సినిమా ఫిబ్ర‌వ‌రి 3న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం. సినిమా చాలా బాగా వ‌చ్చింది. మూవీ త‌ప్ప‌కుండా పెద్ద హిట్ అవుతుంది. ఈ స‌క్సెస్‌తో నాని సెకండ్ హ్యాట్రిక్ కొడ‌తాడు. కేర‌క్ట‌ర్‌ బేస్‌డ్ ల‌వ్‌స్టోరీస్ ఉన్న ఇడియ‌ట్‌, ఆర్య సినిమాలంటే నాకు చాలా ఇష్టం. అలాంటి కేర‌క్ట‌ర్ బేస్డ్ లవ్‌స్టోరీతో తెర‌కెక్కిన చిత్ర‌మిది. యాటిట్యూడ్ ఈజ్ ఎవిరీథింగ్ అనే క్యాప్ష‌న్ పెట్టాం. ఇటీవ‌ల విడుద‌ల చేసిన పాట‌ల‌కు చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. నెక్స్ట్ ఏంటి? అనే పాట కుర్ర‌కారుకు చాలా బాగా న‌చ్చింది. లోక‌ల్ గురించిన పాట కూడా చాలా పెద్ద స‌క్సెస్ అయింది. దేవిశ్రీ ప్ర‌తి పాట‌కూ చాలా మంచి ట్యూన్ ఇచ్చారు. ర‌చ‌యిత‌లు చ‌క్క‌గా రాశారు. ఒక్క‌సారి విన‌గానే మ‌ళ్లీ మ‌ళ్లా పాడుకునేలా ఉన్నాయ‌ని నాతో చాలా మంది అన్నారు. నాని నేచుర‌ల్ పెర్‌ఫార్మ‌ర్‌. ఇందులో ద‌ బెస్ట్‌గా న‌టించాడు. కీర్తి ఈ సినిమాలో మంచి రోల్ చేసింది.ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు చ‌క్క‌గా తెర‌కెక్కించారు. నాని యాక్టింగ్‌, కీర్తి సురేష్ గ్లామ‌ర్‌, టేకింగ్ అన్నీ సినిమాలో హైలైట్ అవుతాయి అన్నారు.


Dil Raju Announced Nenu Local Release Date

నాని, కీర్తిసురేష్ హీరో హీరోయిన్స్‌గా న‌టించిన ఈ చిత్రంలో న‌వీన్ చంద్ర కీల‌క పాపులర్ పోషించారు. ఈ చిత్రానికి సమర్పణ : దిల్ రాజు, సినిమాటోగ్రఫి నిజార్ షఫీ, సంగీతం : దేవి శ్రీ ప్రసాద్, కథ - స్క్రీన్‌ప్లే, మాటలు : ప్రసన్న కుమార్ బెజవాడ, రచన : సాయి కృష్ణ, అసోసియేట్ ప్రొడ్యూసర్ : బెక్కెం వేణుగోపాల్, సహ నిర్మాత : హర్షిత్ రెడ్డి, నిర్మాత : శిరీష్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రినాథ రావు నక్కిన.

English summary
The most awaited film Natural Star Nani and Keerthy Suresh starrer ‘Nenu Local‘ release date announced by makers today.“NenuLocal is releasing on February 3rd 2017. A full on pakka local love story between Actor Nani and Keerthy Suresh.” Dil Raju said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu