»   » ‘ఎవడు' విషయమై మీడియాకు దిల్ రాజు రిక్వెస్ట్ (ఫోటోలు)

‘ఎవడు' విషయమై మీడియాకు దిల్ రాజు రిక్వెస్ట్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్ హీరోగా, అందాల తారలు శృతిహాసన్ , అమీ జాక్సన్ హీరోయిన్స్‌గా...వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీమతి అనిత సమర్పించు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మాత దిల్ రాజు తెరకెక్కిస్తున్న చిత్రం 'ఎవడు' . ఈ చిత్రం విడుదల విషయమై రోజుకో రూమర్ మీడియాలో ప్రచారంలోకి వస్తోంది. దాంతో అభిమానులు కన్ఫూజ్ అవుతారని భావించిన దిల్ రాజు ఈ విషయమై మీడియాకు రిక్వెస్ట్ చేసారు.

దిల్ రాజు మాట్లాడుతూ...-'' 'ఎవడు' ని రైట్ టైమ్ చూసి విడుదల చేస్తాం. అఫీషియల్ ప్రెస్ నోట్ ఇస్తాం. ఈ లోగా విడుదల తేదీ విషయంలో ఏ విధమైన ఊహాగానాలు చేయవద్దని మీడియాని కోరుతున్నాను అన్నారు. అలాగే రెండేళ్లు ఈ సినిమా కోసం శ్రమించాం. ఈ సినిమా చూశాను. కథ విన్నప్పుడు ఎంత ఉద్వేగానికి లోనయ్యానో, చూసినప్పుడు అంతే ఉద్వేగానికి లోనయ్యాను. ఇదే ఫీలింగ్ ప్రేక్షకులకు కలిగితే ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవ్వడం ఖాయం'' అని చెప్పారు.

ఇంతకు ముందు కూడా దిల్ రాజు ....''కొందరు మీడియావాళ్లు మా సినిమా గురించి రాంగ్ వర్డ్స్ వాడుతున్నారు. పవన్‌కల్యాణ్‌కి భయపడి చరణ్ వెనక్కి తగ్గాడని ఇష్టం వచ్చినట్లు రాయడం కరెక్ట్ కాదు. కల్యాణ్ బాబాయ్. చరణ్ అబ్బాయ్. బాబాయిని అబ్బాయి గౌరవిస్తాడు కానీ భయపడడు. ఏ సినిమా అయినా తెరపై చూస్తేనే సత్తా ఏంటో తెలిసేది. నాకు తెలిసి అత్తారింటికి దారేది, ఎవడు... రెండూ పెద్ద హిట్టయ్యే సినిమాలే'' అని 'దిల్' రాజు అన్నారు. అప్పుడు అత్తారింటికి దారేది గురించి ఎవడు చిత్రం వాయిదా వేసారని వార్తలు వచ్చాయి. ఈ నేపధ్యంలో ఆ కామెంట్స్ చేసారు.

'ఎవడు' వాయిదా రీజన్స్ ... స్లైడ్ షో లో...

ఎప్పుడు ఉండొచ్చు?

ఎప్పుడు ఉండొచ్చు?

మొదట ఎవడు చిత్రం జూలై 31 రిలీజ్ అనుకున్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర విభజన ఎనౌన్స్ మెంట్ నేపధ్యంలో దాన్ని ఫోస్ట్ ఫోన్ చేసారు. ఈ లోగా సీమాధ్రలో వేడి మొదలైంది. బంద్ లతో థియోటర్స్ మూసేస్తున్నారు. దాంతో మొత్తం ఈ వాతావరణం చల్లబడి థియోటర్స్ పూర్తిగా ఓపెన్ అయ్యాకే విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

అల్లు అర్జున్ స్పెషల్

అల్లు అర్జున్ స్పెషల్

‘ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ ప్రత్యేక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. వారి పాత్రలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయంటున్నారు. ఉన్నది కొద్ది సేపే అయినా...సినిమాలో కీ రోల్ ప్లే చేస్తారని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రంలో కాజల్ పాత్ర చనిపోతుంది. దీంతోనే కథ మలుపుతిరగనుంది.

ఉద్యమ సెగ...

ఉద్యమ సెగ...

చిరంజీవి కేంద్ర మంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని లేకుంటే ఆయన కుటుంబ సభ్యుల సినిమాలు అడ్డుకుంటామని సమైక్యవాదులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జులై 31న విడుదల కావాల్సిన ‘ఎవడు' ఆగస్టు 21కి వాయిదా వేసారు. సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రం కావడంతో సినిమాను తాజాగా అక్టోబర్ 4కు వాయిదా వేసినట్లు చెప్పుకున్నారు. అయితే దిల్ రాజు ప్రకటనతో ఈ తేదీపై అస్పష్టత నెలకొని ఉంది.

మెగా ఫాన్య్స్ హెచ్చరికలు..

మెగా ఫాన్య్స్ హెచ్చరికలు..

మెగా హీరోల సినిమాలను విడుదల కాకుండా ఆపితే చూస్తూ వూరుకోబోమని 'చిరంజీవి యువత' పేర్కొంది. సినిమాలను రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదని చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు స్వామి నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యమకారుల పేరిట మా హీరోల బొమ్మలు తగలబెడితే సహించబోమని, కుటిల రాజకీయాలను తిప్పికొడతామని హెచ్చరించారు.

ఛాలెంజ్ ...

ఛాలెంజ్ ...

సాయికుమార్ మాట్లాడుతూ... చిరంజీవితో అప్పట్లో ఛాలెంజ్ సినిమా చేసాను. ఆ సినిమాలో నా పాత్ర చిరంజివి అబిమానులు మరిచిపోలేని పాత్ర. ఆయన ఛాలెంజ్ గెలవటానికి ఐదువందలు ఇచ్చి ఆయన గెలునకు కారణమైన పాత్ర అది. ఎవడు లోనూ రామ్ చరణ్ కి ఛాలెంజ్ విసిరే పాత్ర చేసాను అన్నారు . చిత్రంలో తన పాత్ర గురించి చెప్తూ... ధర్మాగా నా పాత్ర చూసిన వారందరూ కొత్త సాయిని చూశామంటారు. ఈ సినిమాలో నా గొంతుతో పాటు కళ్ళు కూడా మాట్లాడతాయి. నా కళ్ళ మీదే ఎక్కువ షాట్లు తీస్తున్నప్పుడు ఎందుకా అనుకున్నాను. ఇప్పుడు రషెష్ చూస్తే తెలుస్తోంది. అన్నారు సాయికుమార్.

'ఫేస్‌ ఆఫ్‌' కాదు..

'ఫేస్‌ ఆఫ్‌' కాదు..

దర్శకుడు మాట్లాడుతూ....'ఎవడు పూర్తిగా వాణిజ్య అంశాలతో మేళవించిన సినిమా. పూర్తిగా రామ్‌చరణ్‌ శైలి, ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని తయారు చేశాం. చరణ్‌ ఇమేజ్‌ ఈ కథకు ప్రధాన బలం.కథ, కథనాలు పూర్తిగా కొత్తగా ఉంటాయి. చిరంజీవి, రామ్‌చరణ్‌ ఇద్దరినీ కూర్చోబెట్టి ఒకేసారి ఈ కథ చెప్పా. వినగానే నచ్చేసింది. సినిమా చూసిన తరవాత పూర్తిస్థాయిలో సంతృప్తి వ్యక్తం చేశారు. 'చెప్పిన దానికంటే బాగా తీశావ్‌' అని చిరు మెచ్చుకొన్నారు. ఇది 'ఫేస్‌ ఆఫ్‌' అనే హాలీవుడ్‌ సినిమాకి స్ఫూర్తి అని చెప్పుకొంటున్నారు. కానీ ఆ సినిమాకీ 'ఎవడు'కీ సంబంధం లేదు'' అన్నారు.

చిరు నమ్మకం...

చిరు నమ్మకం...

చిరంజీవి ఈ సినిమా గురించి మాట్లాడుతూ సినిమా మగధీరను మించిన హిట్టవుతుందని స్పష్టం చేసారు. మగధీర తర్వాత ఆ రేంజి హిట్టయ్యే సినిమా ‘ఎవడు' మాత్రమే. మగధీరకు ఏమాత్రం తీసి పోని సినిమా ఇది, మగధీర తర్వాత ఇంత తక్కువ సమయంలో ఎవడు లాంటి సినిమా చేసే అవకాశం రావడం చరణ్ అదృష్టమే. అభిమానులు ఏ రేంజిలో ఊహించుకున్నా ఆ రేంజిని అందుకునే సత్తా ఉన్న సినిమా ఎవడు అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

ఇదీ టీమ్...

ఇదీ టీమ్...

జయసుధ, సాయికుమార్‌, కోట శ్రీనివాసరావు, రాహుల్‌దేవ్‌, అజయ్‌, ఎల్బీ శ్రీరామ్‌, సుప్రీత్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు నటించారు. ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, కళ: ఆనంద్‌ సాయి, సహ నిర్మాతలు: శిరీష్‌ - లక్ష్మణ్‌, నిర్మాత : దిల్ రాజు, దర్శకత్వం : వంశీ పైడిపల్లి.

English summary
Dil Raju has requested the media not to speculate about the release date of his forthcoming film Yevadu with Ram Charan Tej as hero. Reports are coming in various media that Yevadu is postponed to September/October. Dil Raju has categorically said that he will release Yevadu at the right time.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu