»   » దిల్ రాజు చేతికి మరో సంక్రాంతి మూవీ!

దిల్ రాజు చేతికి మరో సంక్రాంతి మూవీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమాకు భారీ బిజినెస్ జరిగే సీజన్లలో సంక్రాంతి సీజన్ ఒకటి. అందుకే పెద్ద సినిమాలు సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుంటారు. ఈ సారి సంక్రాంతి రేసులో బాలయ్య ‘డిక్టేటర్', జూ ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో', నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రాలతో పాటు శర్వానంద్ నటించిన ‘ఎక్స్‌ప్రెస్ రాజా' మూవీ కూడా పోటీ పడుతోంది.

నైజాం ఏరియాలో టాప్ డిస్ట్రిబ్యూటర్ గా కొనసాగుతున్న దిల్ రాజు ఇప్పటికే ‘డిక్టేటర్' రైట్స్ దక్కించుకున్నారు. తాజా ఆయన ‘ఎక్స్ ప్రెస్ రాజా' రైట్స్ కూడా సొంతం చేసుకున్నారు. తనకు ఉన్న నెట్వర్క్ లో ఈ రెండు చిత్రాలను భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Dil Raju bags Express Raja Nizam rights

ఎక్స్ ప్రెస్ రాజా మూవీ వివరాల్లోకి వెళితే...
రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి సూపర్ హిట్స్ తో దూసుకెళ్తున్న యంగ్ ఎనర్జిటిక్ స్టార్ శ‌ర్వానంద్‌ హీరోగా, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ వంటి తొలి చిత్రంతోనే బంపర్ హట్ అందుకున్న మేర్లపాక గాంధీ దర్శకత్వంలో, సుర‌భి క‌థ‌నాయిక‌గా, మిర్చి, రన్ రాజా రన్, జిల్, భలే భలే మగాడివోయ్ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలతో క్లీన్ ఎంటర్ టైనర్స్ ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఎక్స్ ప్రెస్ రాజా.


శ‌ర్వానంద్, సురభి, ఊర్వ హరీష్ ఉత్తమన్, పోసాని కృష్ణ మురళి సూర్య నాగినీడు బ్రహ్మాజి, సుప్రీత్, సప్తగిరి, ప్రభాస్ ను, షకలకశంక‌ర్‌, ధనరాజ్ త‌దిత‌రులు న‌టించారు. ఈ చిత్రానికి మ్యూజిక్ - ప్రవీణ్ లక్కరాజు, సినిమాటోగ్రఫి - కార్తిక్ గట్టమనేని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - సందీప్. ఎన్, ఎడిటర్ - సత్య.జి, ప్రొడక్షన్ డిజైనర్ - ఎస్.రవిందర్, లిరిక్స్ - భాస్కరభట్ల, శ్రీమణి, శ్రీ జో, డ్యాన్స్ - రాజు సుందరం, విశ్వ, రఘు, చీఫ్ కాస్ట్యూమ్ డిజైనర్ - తోట విజయ్ భాస్కర్, ఫైట్స్ - స్టంట్ జాషువా, ప్రొడక్షన్ కంట్రోలర్స్ - ఎమ్. కృష్ణం రాజు (గోపి), మత్తపాటి షణ్ముఖ రావ్, పి.ఆర్.ఓ - ఎస్.కె.ఎన్, ఏలూరు శ్రీను, పబ్లిసిటీ డిజైనర్ - వర్కింగ్ టైటిల్ (శివ కిరణ్), నిర్మాతలు - వంశీ, ప్రమోద్, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ - మేర్లపాక గాంధి.

English summary
Sharwanand is now gearing up with his upcoming film Express Raja. Latest reports reveal that the noted producer, Dil Raju has bought the Nizam rights of the film for a whopping price.
Please Wait while comments are loading...