»   » మెగా హీరోకు తలనొప్పిగా దిల్ రాజు??: జవాన్ రాకకు ఆయనే అడ్దంకి!?

మెగా హీరోకు తలనొప్పిగా దిల్ రాజు??: జవాన్ రాకకు ఆయనే అడ్దంకి!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బీవీఎస్ రవి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ 'జవాన్' అనే సినిమా చేశాడు. వరుస పరాజయాలతో వున్న తేజు ఈ సినిమా సక్సెస్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా దసరాకి ప్రేక్షకుల ముందుకు రావడం కలిసొస్తుందని భావించాడు. అయితే ఈ సినిమా దసరాకి వచ్చే అవకాశం లేకపోవడంతో ఆయన డీలాపడిపోయాడని చెప్పుకుంటున్నారు.

దిల్ రాజు సమర్పకుడిగా

దిల్ రాజు సమర్పకుడిగా

'జవాన్' సినిమాకి దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.సెప్టెంబర్‌ 1న విడుదలకి సిద్ధమవుతోన్న దశలో 'జవాన్‌' చిత్రానికి అడ్డు తగిలాడట దిల్‌ రాజు. ఈ చిత్రానికి సమర్పకుడి బాధ్యతలు తీసుకున్న దిల్‌ రాజు ఇప్పుడే విడుదల చేయవద్దంటూ నిర్మాతకి తేల్చి చెప్పాడట.


కొత్త ఇమేజ్‌ తెచ్చి పెడుతుందని

కొత్త ఇమేజ్‌ తెచ్చి పెడుతుందని

బివిఎస్‌ రవి డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రం తనకి కొత్త ఇమేజ్‌ తెచ్చి పెడుతుందని సాయి ధరమ్‌ తేజ్‌ ఆశించాడు. దిల్‌ రాజు తనకి బాగా కలిసి రావడంతో దీనికి సమర్పకుని బాధ్యతలు తీసుకోమని తనే రిక్వెస్ట్‌ చేసాడు.ఫైనల్‌ ప్రోడక్ట్‌ తనకి నచ్చితేనే విడుదల చేయాలని కండిషన్‌ పెట్టాడట.


అసంతృప్తి

అసంతృప్తి

అలాగే రిలీజ్‌ డేట్‌ కూడా తనే ఫిక్స్‌ చేస్తానని అన్నాడట. అలా దిల్‌ రాజుకి కమిట్‌ అయిన జవాన్‌ బృందం ఇప్పుడు చిక్కుకుపోయిందట. 'జవాన్' సినిమా చూసిన ఆయన కొన్ని సన్నివేశాల విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేశారట. కొన్ని మార్పులు చేర్పులు చేయవలసి ఉందంటూ, దసరా బరి నుంచి 'జవాన్' ను తప్పించేశారట.


అక్టోబర్లో రిలీజ్

అక్టోబర్లో రిలీజ్

ఆయన చెప్పిన మార్పులు చేసి అక్టోబర్లో రిలీజ్ చేస్తే బాగుంటుందని దర్శకుడు భావిస్తే, అప్పుడు రిలీజ్ కి తగిన సమయం కాదంటూ .. నవంబర్ కి వెళదామని అన్నారట. ఇది తేజుకి మరింత నిరుత్సాహాన్ని కలిగించిందని ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు.


ఎప్పటికి బయటకి వస్తుందో

ఎప్పటికి బయటకి వస్తుందో

ఆ మార్పులేవో తేల్చేస్తే షూటింగ్‌ చేసుకుని దసరాకి అయినా రెడీ కావాలని జవాన్‌ టీమ్‌ ఆశ పడుతోంది కానీ దసరాకి విడుదలయ్యే సినిమాల నైజాం హక్కులన్నీ తనవే కావడంతో దసరాకి మాత్రం ఇది రాకూడదని తెగేసి చెప్పాడట. సాయి ధరమ్‌తేజ్‌తో పాటు బివిఎస్‌ రవికి కూడా కీలకమైన ఈ చిత్రం ఎప్పటికి బయటకి వస్తుందో? పాపం ధరమ్ తేజ్ ఇలా ఇరుక్కు పోయాడేంటోEnglish summary
Dil Raju Became A Drawback For Mega Hero Mega Hero Saidharam Tej's Jawaan release on this Dasara
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X