»   » నిర్మాత దిల్ రాజుకు నైజాం ‘బలుపు’

నిర్మాత దిల్ రాజుకు నైజాం ‘బలుపు’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు 'బలుపు' చిత్రం నైజాం ఏరియా రైట్స్ కొనుగోలు చేసారు. ఇటీవల విడుదలైన 'బలుపు' ఆడియోకు మంచి స్పందన రావడంతో 'బలుపు' చిత్రంపై జనాల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో ఈ చిత్రాన్ని కొనుగోలు చేసేందుకు బయ్యర్లు ఆసక్తి చూపుతున్నారు.

దిల్ రాజు లాంటి నిర్మాత 'బలుపు' నైజాం ఏరియా రైట్స్ మంచి ధర చెల్లించి సొంతం చేసుకోవడం ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. రవితేజ, శృతి హాసన్, అంజలి హీరో హీరోయిన్లుగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న బలుపు చిత్రాన్ని పివిపి సినిమా బేనర్‌పై ప్రసాద్ వి.పొట్లూరి నిర్మిస్తున్నారు.

మాస్ ఎంటర్టెనర్‌గా రూపొందిన ఈచిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. మరో పది రోజుల్లో ఈచిత్రం సెన్సార్‌కు వెళ్లనుంది. జూన్ 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. త్వరలో విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది.

ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, రావు రమేష్, అలీ, అశుతోష్ రాణా, అడవి శేషు, సుప్రీత్, ఆదిత్య మీనన్, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, శేఖర్, అజయ్, షఫీ, శ్రీనివాస్ రెడ్డి, సన, రాజశ్రీ నాయర్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈచిత్రానికి కథ, మాటలు: కోన వెంకట్, కె. ఎస్. రవీంద్ర, పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, భాస్కర భట్ల, ఫైట్స్: స్టన్ శివ, కొరియోగ్రఫీ: రాజు సుందరం, బృందం, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: గౌతం రాజు, సినిమాటోగ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: థమన్, నిర్మాత: పరమ్ వి. పొట్లూరి.

English summary
Tollywood producer and leading distributor Dil Raju bought Ravi Teja starrer Balupu for a whopping price for Nizam area. This mass entertainer produced by PVP Cinema and directed by Gopichand Malineni.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu