సాధారణంగా అలా చేయాలంటే నాకు భయం.. హ్యంగోవ‌ర్‌లో ఉండిపోతాం: దిల్ రాజు

శ‌ర్వానంద్, స‌మంత హీరో హీరోయిన్లుగా దిల్ రాజు నిర్మించిన తాజా సినిమా 'జాను'. ప్రేమ్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 7న విడుదల కానుంది. త‌మిళ చిత్రం '96'కు రీమేక్‌‌గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

బ్యాన‌ర్ స్టార్ట్ అయి 17 ఏళ్లు.. అయినా

బ్యాన‌ర్ స్టార్ట్ అయి 17 ఏళ్లు.. అయినా

దిల్‌రాజు నిర్మించిన తొలి రీమేక్ మూవీ ఇదే. ఈ సందర్భంగా దీని గురించి దిల్‌రాజు స్పందిస్తూ.. మా బ్యాన‌ర్ స్టార్ట్ అయి 17 ఏళ్లు అవుతోంది. ఇన్నేళ్ల‌లో మేం చేసిన తొలి రీమేక్ ఇది. సాధారణంగా రీమేక్ చేయాలంటే నాకు భ‌యం. ఒరిజిల్ ఫీల్‌ను మిస్ కాకుండా తెర‌పైకి తీసుకురావ‌డం చాలా క‌ష్టం అనేది నా భావన. త‌మిళంలో 96 సినిమాను రిలీజ్ కంటే ఒక నెల ముందు చూశాను. చూసిన త‌ర్వాత ప్రివ్యూ థియేట‌ర్ నుండి బ‌య‌ట‌కు రాగానే ప్రొడ్యూస‌ర్‌కి ఈ సినిమాను నేను తెలుగులో రీమేక్ చేస్తానంటూ చెక్ ఇచ్చేశాను అని చెప్పారు దిల్ రాజు.

ఇలా నేను డిసైడ్ కావడానికి కారణం

ఇలా నేను డిసైడ్ కావడానికి కారణం

ఇలా నేను డిసైడ్ కావడానికి కారణం కూడా ఉంది. 96 సినిమా చూసే స‌మ‌యంలో ఎమోష‌న్స్‌తో గుండె బ‌రువెక్కింది. అలాగే త‌మిళంలో సినిమా రిలీజ్ అయిన త‌ర్వాత ఆడియెన్స్‌తో క‌లిసి సినిమా చూశాను. ప్రేక్ష‌కుల నుండి వ‌చ్చిన రెస్పాన్స్ చూసి ఎవ‌రు ఏమ‌నుకున్నా? ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాల‌ని డిసైడ్ అయ్యాను అని అన్నారు రాజు.

స‌మంత‌ త‌ప్ప‌.. ఎవ్వరూ సెట్ కారని

స‌మంత‌ త‌ప్ప‌.. ఎవ్వరూ సెట్ కారని

స‌మంత‌ త‌ప్ప‌.. ఆ పాత్ర‌లో ఎవ్వరూ సెట్ కారని ముందే ఊహించా. ఇక నా బ్ర‌ద‌ర్ శ‌ర్వాకి ఫోన్ చేసి సినిమా చూడ‌మంటే సినిమా చూసి సూప‌ర్బ్‌గా ఉంద‌ని చెప్పాడు. అలా శ‌ర్వా, స‌మంత ఈ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు.త‌మిళంలో సినిమా చేసిన ప్రేమ్‌కుమార్‌తో మాట్లాడి తెలుగులోనూ డైరెక్ట్ చేయ‌మ‌ని చెప్పాను. ఈ సినిమాను చేస్తున్న‌ప్పుడు దిల్‌రాజుకేమైనా మెంటలా? డ‌బ్బింగ్ చేయొచ్చు క‌దా? అని చాలా కామెంట్స్ విన్నాను.

 నేను చెప్పిన‌వ‌న్నీ నిజాలు అవుతాయి

నేను చెప్పిన‌వ‌న్నీ నిజాలు అవుతాయి

ఆ ఫీల్‌ను తెలుగులో అలాగే క్యారీ చేస్తూ డైరెక్ట‌ర్ ప్రేమ్ తెలుగులోకి తీసుకొచ్చారు. చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతున్నా.. ఈ ఫిబ్ర‌వ‌రి 7న మా 'జాను' సినిమాను చూసిన తెలుగు ప్రేక్ష‌కులు వావ్! అనక తప్పదు. ఈ సినిమా హ్యంగోవ‌ర్‌లో ఉండిపోతాం. ఫిబ్ర‌వ‌రి 7న నేను చెప్పిన‌వ‌న్నీ నిజాలు అవుతాయి. జాను సినిమా చూసిన త‌ర్వాత మ‌న లైఫ్‌లోని మెమొరీస్‌ను ఇంటికి తీసుకెళ్తాం అన్నారు దిల్ రాజు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X