twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అన్ని సినిమాలకు ఒకటే రేటు.. గుడ్ న్యూస్ చెప్పిన దిల్ రాజు.. ఎంతంటే?

    |

    టాలీవుడ్ లో మొన్నటి వరకు సినిమా టికెట్ రేట్ల మీద పెద్ద ఎత్తున సందిగ్దత కొనసాగింది. కొన్ని సినిమా రేట్లు భారీగా పెంచుకుని అమ్మితే చిన్ని సినిమాల రేట్లు కూడా అదే విధంగా అమ్మడంతో సినిమా పరిశ్రమ భారీగా నష్టపోతోందని థియేటర్లకు వచ్చే అభిమానులే కరువైపోతున్నారంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో తాజాగా దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన వివరాలు లోకి వెళితే..

     భారీగా రేట్లు

    భారీగా రేట్లు

    కొద్ది రోజుల క్రితం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్లను భారీగా తగ్గించి జీవో జారీ చేయడంతో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. హైకోర్టు వరకు వెళ్లి కూడా టికెట్ల రేట్లు పెంచే విధంగా చర్యలు తీసుకోగలిగారు కానీ ఇప్పుడు తెలంగాణలో సినిమా అనగానే భారీగా రేట్లు పెంచేసి అమ్మేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రాలో రెండిట్లోనూ థియేటర్లకు వచ్చి సినిమా చూసే ప్రేక్షకులే కరువయ్య పరిస్థితి ఏర్పడుతోంది

    ఒకే ధర

    ఒకే ధర


    ఈ విషయం మీద నిర్మాతలు పునరాలోచిన చేయాలని ఇప్పటికే పలుసార్లు భేటీ అయ్యారు. ఎలాంటి సినిమాలు ఎలాంటి టికెట్ రేట్లు ఉంచాలనే విషయం మీద తాజాగా ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్మాతలు చర్చలు జరిపినట్లు తెలుస్తున్న నేపథ్యంలో తాజాగా దిల్ రాజు మాట్లాడిన మాటలు సంచలనం రేపుతున్నాయి. తాజాగా సినీ ప్రియులకు ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు గుడ్‌ న్యూస్‌ చెప్పారు. అదేమిటంటే ఇక మీదట అన్ని సినిమాలకు ఒకే ధర ఉంటుందని ఆయన వెల్లడించారు.

     అన్ని సినిమాలకు

    అన్ని సినిమాలకు


    కాకపోతే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన స్టార్‌ హీరోల సినిమాలకు మాత్రం ఈ విషయంలో మినహాయింపు ఉంటుందని ఆయన స్పష్టం చేశాడు. బుధవారం నాడు జరిగిన థాంక్యూ సినిమా ప్రెస్‌మీట్‌లో దిల్‌ రాజు మాట్లాడుతూ.. స్టార్‌ హీరోల హై బడ్జెట్‌ చిత్రాలను మినహాయిస్తే అన్ని సినిమాలకు టికెట్‌ రేట్లు ఒకేలా ఉంటాయని చెప్పుకొచ్చారు. మేజర్‌, విక్రమ్‌ సినిమాలకు ఉన్న రేట్లే ఇక మీదట అన్ని సినిమాలకు ఉంటాయని ఆయన వెల్లడించారు.

     ప్రపంచ వ్యాప్తంగా

    ప్రపంచ వ్యాప్తంగా


    హైదరాబాద్‌, వైజాగ్‌ లాంటి పట్టణాల్లో సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో జీఎస్టీ కలిపి రూ.150, మల్టీప్లెక్స్‌లో రూ.200 ఉంటాయని దిల్ రాజు పేర్కొన్నారు. నిర్మాతలందరం కలిసి చర్చించాకే టికెట్‌ రేట్లపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. మరి ఈ అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందనేది చూడాల్సి ఉంది. ఇక నాగచైతన్య రాశి ఖన్నా హీరో హీరోయిన్ గా నటించిన థాంక్యూ సినిమా ఈనెల 22వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న విషయం తెలిసిందే.

     హిట్ కొట్టాలని

    హిట్ కొట్టాలని


    దిల్ రాజు ప్రొడక్షన్లో నిర్మించిన ఈ సినిమాకు మనం దర్శకుడు విక్రమ్ కే కుమార్ డైరెక్ట్ చేశాడు. ఇక ఈ సినిమాపై ఇప్పటికే ట్రైలర్ తో పాటు సాంగ్స్ కూడా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాటు దిల్ రాజుకు మాత్రమే కాక దర్శకుడు విక్రమ్, హీరో నాగచైతన్యకి కూడా చాలా క్రూషియల్. ఈ సినిమా ద్వారా వారంతా హిట్ కొట్టాలని చూస్తున్నారు.

    English summary
    Dil raju comments on telugu states movie ticket rates become viral in social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X