»   » 7 రోజుల్లో 100కోట్లు..అయినా సరే గట్టెక్కటం కష్టమే: దువ్వాడ వసూళ్లు

7 రోజుల్లో 100కోట్లు..అయినా సరే గట్టెక్కటం కష్టమే: దువ్వాడ వసూళ్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హరీశ్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా చేసిన 'దువ్వాడ జగన్నాథం' భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. విడుదలైన ప్రతి ఏరియా నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. వసూళ్ల పరంగా ఈ సినిమా దూకుడు చూస్తుంటే, 100 కోట్ల క్లబ్ లో చేరడానికి ఎంతో సమయం పట్టదని చెబుతున్నారు. కేవలం 4 రోజుల్లోనే 75 కోట్లు గ్రాస్ వచ్చిందట.

దిల్ రాజు

దిల్ రాజు

ఈ సందర్భంగా దిల్ రాజు ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. భారీ అంచనాలు వలనే ఇటువంటి స్పందన వచ్చింది అని అది సినిమా కలెక్షన్లు పై ఎటువంటి ప్రభావం చూపలేదని ఆ చిత్ర యూనిట్ చెబుతుంది. ఇక నిర్మాత దిల్ రాజు అయితే ఒక ఆశ్చర్యపరిచే ప్రకటన చేశాడు.


100 కోట్లు రికార్డు కూడా చేయబోతుంది

100 కోట్లు రికార్డు కూడా చేయబోతుంది

దువ్వాడ జగన్నాధం సక్సెస్ మీట్ లో మా సినిమా 4 రోజులలో 75 కోట్లు గ్రాస్ కలెక్షన్లు సాధించింది అని ఇంకా ఈ వారంలోనే 100 కోట్లు రికార్డు కూడా చేయబోతుంది అని చెప్పాడు. నిర్మాత - సినిమా పంపిణీదారుడుగా చాలా అనుభవం ఉన్న దిల్ రాజు ఇలా మాట్లాడటం అల్లు అర్జున్ ఫాన్స్ కాస్త ఊరటనివ్వచ్చు కాని.. 100 కోట్లు గ్రాస్ వచ్చినా కూడా సినిమాను పంపిణీ చేసిన వారు పెద్దగా రికవర్ అవ్వరు కదా అనే మాట ట్రేడ్ వర్గాల నుండి వినిపిస్తోంది.


సగం లాస్ తెచ్చే ఛాన్సుంది

సగం లాస్ తెచ్చే ఛాన్సుంది

ముఖ్యంగా యూఎస్ మార్కెట్ లో బాలీవుడ్ ట్యూబులైటును సినిమాను సైతం వెనకకు నెట్టిన దువ్వాడ జగన్నాధం.. ఫుల్ రన్ లో సగం లాస్ తెచ్చే ఛాన్సుందనేది ట్రేడ్ వర్గాల జోస్యం. అల్లు అర్జున్ విషయానికొస్తే.. జులాయ్.. రేసుగుర్రం.. సన్నాఫ్ సత్యమూర్తి వంటి సినిమాలు ఓవర్సీస్ లో కూడా బాగానే ఆడాయి.


ఇక్కడే 70 కోట్ల షేర్

ఇక్కడే 70 కోట్ల షేర్

ఆ సినిమాలోని క్లాస్ కంటెంట్ , ఇంటెలిజెంట్ సీన్లు అనండి.. అవన్నీ బాగా కలిసొచ్చాయి. కాని సరైనోడు సినిమాతో మాస్ ప్రేక్షకులకు రెడ్ కార్పెట్ వేశాడు అల్లు అర్జున్. ఆ దెబ్బతో ఓవర్సీస్ సాయం లేకుండా ఇక్కడే 70 కోట్ల షేర్ రాబట్టేశాడు కాని.. అక్కడ మాత్రం ఫ్లాపును కొట్టాడు.


ఓవర్సీస్ లో మరోసారి

ఓవర్సీస్ లో మరోసారి

ఇప్పుడు దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో కూడా ఓవర్సీస్ లో మరోసారి ఖంగుతిన్నాడు. ప్రస్తుతానికి 1 మిలియన్ డాలర్ల వసూలుకు చేరువలో ఉన్న ఈ సినిమా.. 2 మిలియన్ తేకపోతే మాత్రం ఫ్లాపే. వరుసగా అమెరికాలో రెండో ఫ్లాపంటే మరి బన్నీ జాగ్రత్తపడాల్సిందే.English summary
'Bunny used to tease Me always saying - Sir, You can't make a Mass Film in SVC Banner. 25th Film...Bunny's Highest Grosser & This is a Mass Movie! DJ collected Rs 75 crore gross in 4 Days and going to amass Rs 100 crore in 1 Week. So, What you said impossible has become possible through you itself" Said Dil Raju
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu