»   » ఆరోజు నాగ చైతన్యని తిట్టాను, కుర్రాడు మగాడైన కథ ఇది: దిల్ రాజు

ఆరోజు నాగ చైతన్యని తిట్టాను, కుర్రాడు మగాడైన కథ ఇది: దిల్ రాజు

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమాలో లవ్ స్టోరీతో పాటు ఒక థ్రిల్లర్ ఉంది. ఏ మాయ చేశావే ఒక కుర్రాడి కథ అయితే.. అదే కుర్రాడు ఒక మగాడు అయ్యాక జరిగే కథే ఈ సినిమా ప్రేమం తర్వాత నా తరఫునుండి నాగ చైతన్యకి ఇంకో హిట్ ఇచ్చేస్తున్నా... అన్నాడు దిల్ రాజు. సాహసం శ్వాసగా సినిమా విడుదలకు ముందే ఇది హిట్ అని తేల్చేసాడు.

ఇంతే కాదు కొన్ని పాత విశయాలు కూడా చెప్తూ నాగ చైతన్యని తాను తిట్టిన సంగతిని కూడా గుర్తు చేసుకున్నాడు. 'నిజానికి మేం చైతన్యను జోష్ సినిమాతో లాంచ్ చేస్తున్నప్పుడు ఒక సంఘటన జరిగింది. జోష్ షూటింగ్ మద్యలో ఉన్నప్పుడు.. సార్ ఇంకో సినిమా కమిట్ అయ్యాను అంటూ చైతన్య చెప్పాడు. గౌతమ్ మీనన్ డైరక్షన్లో లవ్ స్టోరీ అన్నాడు. అదేంటి మన సినిమా శివ రేంజులో హిట్టయ్యి నువ్వు యాక్షన్ స్టార్ అయిపోతావ్.. ఈ లవ్ స్టోరీ ఎందుకు అని తిట్టాను. కాని రిజల్టు రివర్స్ అయ్యింది. అలాగే ఇప్పుడు కూడా సాహసం శ్వాసగా సాగిపో రిలీజ్ లేటైంది కాబట్టి.. ఏముంటుందిలే అనుకున్నాను. కాని మొన్న సినిమా చూసినప్పుడు షాకయ్యాను. ఏ మాయ చేశావే ఫస్ట్ హాఫ్ అయితే.. సెకండాఫ్ ఒక ఘర్షణ సినిమాలా ఉంది. నేను కాదు.. త్వరలో ప్రేక్షకులే ఆ విషయం చెబుతారు'' అంటూ చెప్పాడు దిల్ రాజు.


DIl Raju Confident on Saahasam swaasaga saagipo success

ఇలా తన అంచనాలు తలకిందులవుతాయని అప్పుడు అనుకోలేదని నిజాయితీగా ఒప్పుకున్నాడు నిర్మాతగాను .. డిస్ట్రిబ్యూటర్ గాను దిల్ రాజుకి మంచి అనుభవం వుంది. యూత్ కి .. మాస్ కి .. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఏ కథాంశాలు చేరువవుతాయో ఆయనకి బాగా తెలుసు. అందువలన ఆయన ఖాతాలో విజయాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి దిల్ రాజు తాజాగా 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా నైజాం ఏరియా హక్కులను సొంతం చేసుకున్నాడు.ఈ సినిమా ఇక్కడ ఒక రేంజ్ లో దూసుకెళ్లడం ఖాయమని చెప్పుకుంటున్నారు.


DIl Raju Confident on Saahasam swaasaga saagipo success

ఓ పక్క నిర్మాతగా సూపర్ ఫాంలో ఉన్న దిల్ రాజు మరో పక్క డిస్ట్రిబ్యూటర్ గా కూడా మంచి క్రేజ్ లో ఉన్నాడు. నైజాంలో మంచి పట్టు ఉన్న దిల్ రాజు తన సినిమాలకే కాదు పంపిణీ చేసిన సినిమాలను కూడా తన సినిమాల రేంజ్లో రిలీజ్ చేస్తాడు. అందుకే పెద్ద సినిమాలకు నిర్మాతల కన్నా డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు ఎక్కువ లాభాలు దక్కించుకున్నాడు. చాలా కాలం కిందటే థియేటరికల్ ట్రైలర్ విడుదల అయినా.. నాగచైతన్య సినిమా "సాహసం శ్వాసగా సాగిపో' విడుదల మాత్రం వాయిదాలు పడుతూ పోతోంది. ఎట్టకేలకూ ఈ సినిమాను నవంబర్ లో విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు.

English summary
Ace producer Dil Raju has bought the Nizam rights of Naga Chaitanya's latest movie "Sahasam Swaasaga Saagipo" and he stated that he got bowled out after watching the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu