»   » అంతటి విషాదం లోనూ దిల్‌రాజు కథ ఆలోచించాడట

అంతటి విషాదం లోనూ దిల్‌రాజు కథ ఆలోచించాడట

Posted By:
Subscribe to Filmibeat Telugu

కళాకారులకే కాదు కళ తో సంబందం ఉన్న వాళ్ళకి కూడా ఒక దారుణమైన నరకం ఉంటుంది. మామూలుగా మనం ఉండే దానికంటే కూడా అది వర్ణనాతీతం. అదేమిటంటే విపరీతమైన భాదలో ఉన్నప్పుడు కూదా తమ హావ భావాలెలా ఉన్నాయి అనో, లేదంటే అదె సన్ని వేశం ఏదైనా సినిమాలో ఉంటే ఎలా ఉంటుందనో ఆలోచిస్తూంటారట. భాదని కూడా మనస్పూర్తిగా అనుభవించలేకపోవటం కంటే విషాదం ఏముంటుంది? తాజాగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకి కూడా ఇదే సందర్భం ఎదురయ్యింది... జీవితం లో తేరుకోలేని విషాద సంఘటన జరిగిన విషయం తెల్సిందే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన తన భార్య మరణం గురించి స్పందించాడు.

అమెరికాలో ఉండగా భార్య మరణం గురించి

అమెరికాలో ఉండగా భార్య మరణం గురించి

తాను అమెరికాలో ఉండగా భార్య మరణం గురించి తెలిసిందని.. అక్కడి నుంచి ఇంటికి చేరుకోవడానికి 27 గంటలు పట్టిందని.. ఈ 27 గంటలు తాను నరకం చూశానని రాజు అన్నాడు. అయితే అంత విషాద సమయంలోనూ ఆయన మెదడులో ఒక కథ తయారయ్యిందట....

ఇంటి నుంచి బయటకు వెళ్లలేదు

ఇంటి నుంచి బయటకు వెళ్లలేదు

‘‘నా భర్య చనిపోయాక నేను పదమూడు రోజు లు ఇంటి నుంచి బయటకు వెళ్లలేదు. ఆ సమయంలో ‘ఇదే ఇదే జీవితం.. సుఖః దుఃఖాల సంగమం' పాట వింటూ గడిపాను. అప్పుడనిపించింది.. రచయితలు ఊరికే రాయరు. జీవిత అనుభవాలనే పాటలుగా రాస్తారని. ఆ థాట్ ప్రాసెస్ లో నాకొక స్టోరీ లైన్ తట్టింది. ఆ స్టోరీతో సినిమా తీయాలనుకుంటున్నా'' అని దిల్ రాజు తెలిపాడు.

జీవితం చాలా విచిత్రమైంది

జీవితం చాలా విచిత్రమైంది

గత ఐదు నెలల కాలం తన జీవితంలో చిత్రమైన అనుభవాలను.. మిశ్రమానుభూతులను మిగిల్చిందని రాజు తెలిపాడు. ‘‘జీవితం చాలా విచిత్రమైంది. గడచిన ఐదు నెలల్లో ‘శతమానం భవతి' ఒక సంతోషం.. నాకు మనవడు పుట్టడం ఒక సంతోషం.. ‘నేను లోకల్' ఒక సంతోషం..

అనుకోని జర్క్

అనుకోని జర్క్

జీవితం అద్భుతంగా ముందుకు సాగుతోంది అనుకున్నప్పుడు దేవుడు అనుకోని జర్క్ ఇచ్చాడు. ఆ బాధలో ఉండగానే ‘శతమానం భవతి'కి నేషనల్ అవార్డు.. దాంతో పాటు నాకు చక్రపాణి-నాగిరెడ్డి అవార్డు దక్కాయి. ఐదు నెలల్లో దేవుడు అటూ.. ఇటూ చూపించాడు'' అంటూ తనలో భాదని చెప్పుకొచ్చాడు దిల్ రాజు

English summary
Raju has revealed that he got a story idea during that painful Time of His Wife Death
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu