»   » ‘శతమానం భవతి’ లో దిల్ రాజు గెస్ట్ గా నిజమే..ఇదిగో సాక్ష్యం (వీడియో)

‘శతమానం భవతి’ లో దిల్ రాజు గెస్ట్ గా నిజమే..ఇదిగో సాక్ష్యం (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: దిల్ రాజు తన తాజా చిత్రంలో నటించారనే వార్త నిజమని తేలిపోయింది. ఈ సంక్రాంతికి రిలీజవుతున్న సినిమాల్లో 'శతమానం భవతి' కూడా ఒకటి. రెండు భర్తీ సినిమాలతో రిలీజవుతుండటంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొని ఉందని సంగతి తెలిసిందే. నిర్మాత దిల్ రాజు కూడా ఈ సినిమాను కుటుంబ విలువలతో చాలా గొప్పగా నిర్మించారని చెప్తున్నారు. అది ప్రక్కన పెడితే.. తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. ఆ ట్రైలర్ ను బాగా గమనిస్తే అందులో ఒక గుడి సన్నివేశంలో హీరో శర్వానంద్ తో పాటు పల్లకి మోస్తూ దిల్ రాజు కూడా దర్శనమిచ్చాడు.


శర్వానంద్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటిస్తున్న చిత్రం 'శతమానం భవతి'. ప్రకాష్‌రాజ్‌, జయసుధ కీలక ప్రాతలు పోషిస్తున్నారు. సతీష్‌ వేగ్నేశ దర్శకుడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. పల్లెటూరి అనుబంధాల్ని, అక్కడి అల్లరిని గుర్తు చేసే చిత్రంలా 'శతమానం భవతి'ని తీర్చిదిద్దినట్లు కనిపిస్తోంది. మిక్కీ జె.మేయర్‌ అందించిన స్వరాలకు ఇప్పటికే చక్కటి ఆదరణ లభిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


'అమ్మాయిలను ఇంప్రెస్‌ చేస్తే పడరు. వాళ్లు ఇంప్రెస్‌ అయితే పడతారు'
'మన సంతోషాన్ని పది మందితో పంచుకుంటే బాగుంటుంది కానీ, మన బాధను పంచి వాళ్లను కూడా బాధ పెట్టడం ఎందుకు'
'ప్రేమించిన మనిషిని వదులుకోవడం అంటే ప్రేమను వదులుకోవడం కాదు' అంటూ శర్వానంద్‌ పలికిన డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి.


Dil Raju guet in Sharwanand 's Shatamanam Bhavati Trailer

రచయితగా ఎక్కువమందికి తెలిసిన వేగేశ్న సతీశ చెప్పిన ఫ్యామిలీ స్టోరీ బాగా నచ్చి, ఆయన దర్శకత్వంలోనే ఈ చిత్రాన్ని నిర్మించారు రాజు. అదివరకు 'దొంగల బండి' అనే ఫ్లాప్‌ సినిమా తీసినప్పటికీ సతీశపై ఆయన నమ్మకముంచారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకొనే రీతిలోనే చిత్రాన్ని కంటికింపుగా మలచడంలో సతీశ సక్సెస్సయ్యారని యూనిట్‌ సభ్యులు అంటున్నారు.


ఇప్పటి వరకూ తను చేసిన పాత్రలకు భిన్నమైన పాత్రలో, ఓ పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో శర్వానంద్‌ నటించిన ఈ సినిమాను ఏమాత్రం తక్కువ అంచనాలు వేయడానికి వీలులేదు. దిల్‌ రాజు సినిమా అనే ప్రచారం ఈ చిత్రానికి పెద్ద బలం అని చెప్తున్నారు.

English summary
Dil Raju and Sri Venkateswara Creations' 'Shatamanam Bhavathi', with Sharwanand and Anupama Parameshwaran in lead roles, is all set for a release on January 14th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu