మగధీర తర్వాత బెస్ట్ ఓపెనింగ్ రికార్డ్ తో జూ ఎన్టీఆర్ ‘బృందావనం’ ...!
'బృందావనం" అనే క్లాస్ టైటిల్ పెట్టుకుని, తన సినిమాల్లో ఉండే మాస్ మసాలాలన్నీ సగానికి సగం తగ్గించి నాటుతనాన్ని సైడుకి నెట్టి, నీటు కుర్రాడిలా కనిపించేందుకు ఎఫర్ట్స్ పెట్టి జూ ఎన్టీఆర్ చేసిన ప్రయత్నం సత్పలితాలను ఇస్తోంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనిపించుకునే రీతిలో సినిమా నీట్ గా తెరకెక్కేలా చూసుకున్న దిల్ రాజు తన అనుభవాన్నంతా ఉపయోగించుకుని 'బృందావనం" చిత్రాని పర్ ఫెక్ట్ ప్లానింగ్ తో రిలీజ్ చేశాడు.
జూ ఎన్టీఆర్ తాజా చిత్రం 'బృందావనం" దిగ్విజయంగా ప్రదర్శింపబడుతోందంటూ నిన్ననే సక్సెస్ మీట్ పెట్టి మరీ తన ఆనందాన్ని వ్యక్తం చేసిన దిల్ రాజు ఈ చిత్రానికి అన్ని చోట్లా భారీ వసూళ్ళు లభించాయని తెలిపారు. కాగా 'బృందావనం" సాధించిన ఫస్ట్ వీక్ షేర్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
నైజాం: 5,50,00,000
సీడెడ్: 4,33,22,132
నెల్లూరు: 79,50,000
గుంటూరు: 1,58,00,000
వైజాగ్: 1,51,54,600
కృష్ణా: 1,09,53,670
ఈస్ట్: 99,00,500
వెస్ట్: 98,72,570
కర్ణాటక: 2,35,89,420
ఓవర్సీస్: 2,60,00,000
నార్త్ ఇండియా: 39,10,420
టోటల్ గా జూ ఎన్టీఆర్ 'బృందావనం" తొలి వారంలో పొందిన షేర్: 22,14,60,312/-. మొత్తానికి మొదటి రోజు కలెక్షన్స్ బాక్సాఫీస్ ని షేక్ చేయకపోయినా బాగానే వచ్చాయి దానికి తోడు టాక్ పాజిటివ్ గా రావడంతో కలెక్షన్స్ బెటర్ అయ్యాయి. మొత్తమ్మీద మొదటివారంలో జూ ఎన్టీఆర్ అదరగొట్టాడనే చెప్పాలి. ఫస్ట్ వీక్ షేర్ ట్వంటీ టూ క్రోర్స్ మార్క్ టచ్ చేసింది. 'మగధీర" తర్వాత తెలుగులో ఇదే బెస్ట్ ఓపెనింగ్ రికార్డ్ అయింది.


Click it and Unblock the Notifications











