»   » హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ జూ ఎన్టీఆర్ దే....!?

హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ జూ ఎన్టీఆర్ దే....!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బృందావనం చిత్రం ఆడియో విడుదలైనప్పుడు ఈ సినిమా ఈ ఏడాది విడదులైన చిత్రాల్లో టాప్ త్రీలో ఉంటుందని దిల్ రాజు నమ్మకంగా చెప్పాడు. సినిమా విడుదలకి సన్నాహాలు జరుగుతున్నప్పుడు, రోబో రిలీజయి సంచలనం సష్టిస్తున్నప్పుడు , ఖలేజా, ఆరెంజ్ వంటి పెద్ద సినిమాలు విడుదలవుతాయని తెలిసినప్పుడు కూడా దిల్ రాజు అదే మాట మళ్లీ మళ్లీ చెప్పాడు. అతను నమ్మకం వ్యక్తం చేసినట్టే బృందావనం మంచి హిట్టయింది. అంతే కాదు దిల్ రాజు మాటని నిజం చేస్తూ ఈ ఏడాది టాప్ త్రీ టాలీవుడ్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. 'రోబో", 'సింహా" తర్వాత కలెక్షన్ల పరంగా మూడోస్థానం బృందావనం కే సొంతమయింది.

ఇక ఈ నెలలో విడుదలయ్యే చిత్రాలేవీ బృందావనం రికార్డుని కొట్టకపోతే దిల్ రాజు మాట పూర్తిగా నిజమయినట్టే. నేటితో బృందావనం చిత్రం 140 డైరెక్ట్ కేంద్రాల్లో యాభై రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుంది. అర్థ శతదినోత్సవాన్ని త్వరలో నిజామాద్ లో ఘనంగా జరిపేందుకు దిల్ రాజు సన్నాహాలు చేసుకుంటున్నాడు. మొత్తమ్మీద ఈ విజయంతో ఎన్టీఆర్ కి 'అదుర్స్",'బృందావనం" రూపంలో ఈ ఇయర్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ సాధించాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu