»   »  దిల్ రాజు నైజాం ‘డిక్టేటర్’!

దిల్ రాజు నైజాం ‘డిక్టేటర్’!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నైజాం ఏరియాలో పెద్ద సినిమాల డిస్ట్రిబ్యూషన్ హక్కులు దక్కించుకోవడంలో ఎవరిది పై చేయి అంటే అందరూ ముందుగా చెప్పేది దిల్ రాజు పేరు. నైజాం ఏరియాలో దిల్ రాజు చాలా కాలంగా ఈ విషయంలో నెం.1 స్థానంలో కొనసాగుతున్నారు. తాజాగా ‘డిక్టేటర్' మూవీ నైజాం హక్కులను కూడా ఆయనే సొంతం చేసుకున్నారు. ఈ విషయంలో నిర్మాతలతో ఆయన భారీ డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే హక్కులు ఎంతకు సొంతం చేసుకున్నారు? అనేది ఇంకా బయటకు రాలేదు.

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం డిక్టేటర్. ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సినిమాను సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తుంది.


Dil Raju has bought the Nizam rights of Dictator

ఈ సందర్భంగా..కో ప్రొడ్యూసర్, దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ ‘'ప్రస్తుతం బాలకృష్ణ డిక్టేటర్ సాంగ్ చిత్రీకరణను పూర్తి చేశాం. వరికుప్పల యాదగిరి సాహిత్యం అందించిన టింగా టింగా... అనే స్పెషల్ సాంగ్ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ సాంగ్ ను బాలకృష్ణ, ముమైత్ ఖాన్, శ్రద్ధాదాస్ లపై చిత్రీకరించారు. డిసెంబర్ 20న థమన్ సంగీతంలో విడుదలైన పాటలకు, థియేట్రికల్ ట్రైలర్ కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా చిత్రీకరణతో పాటు నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా శరవేగంగా పూర్తవుతున్నాయి అన్నారు.


సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవల్ లో విడుదల చేస్తున్నాం. నందమూరి అభిమానులు బాలయ్యబాబును ఎలా చూడాలనుకుంటున్నారో అలా, ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఫుల్ ఎంటర్ టైనింగ్ తో స్టయిలిష్ గా సినిమా రూపొందుతోంది‘‘ అన్నారు.


ఆనంద్ రామరాజు, సుమన్‌, పవిత్రాలోకేష్‌, నాజర్‌, వెన్నెల కిషోర్‌, పృథ్వీ, కాశీ విశ్వనాథ్‌, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, హేమ, కబీర్‌, విక్రమ్‌ జీత్‌,అజయ్‌ తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి ఫైట్స్‌: రవివర్మ, ఆర్ట్‌: బ్రహ్మకడలి, ఎడిటర్‌: గౌతంరాజు, మ్యూజిక్‌: ఎస్‌.ఎస్‌.థమన్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, రచన: శ్రీధర్‌ సీపాన, మాటు: ఎం.రత్నం, కథ, స్క్రీన్‌ప్లే: కోనవెంకట్‌,గోపిమోహన్‌, నిర్మాత: ఈరోస్‌ ఇంరట్నేషనల్‌, కో ప్రొడ్యూసర్‌, దర్శకత్వం: శ్రీవాస్‌.

English summary
Nandamuri Balakrishna’s Dictator is days away from completion. Meanwhile, latest update from the unit reveals that noted producer, Dil Raju has bought the Nizam rights of the film for a whopping price.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu