»   » 'కేరింత' కోసం దిల్ రాజు స్టార్ హంట్..డిటేల్స్

'కేరింత' కోసం దిల్ రాజు స్టార్ హంట్..డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :'వినాయకుడు' తో తానేంటో ప్రూవ్ చేసుకున్న దర్శకుడు సాయి కిరణ్ అడవి కొత్త చిత్రం 'కేరింత'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మై డ్రీం సినిమా బ్యానర్ ఫై దిల్ రాజు, సాయి కిరణ్ అడవి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజీలో ఉన్న ఈ చిత్రం త్వరలో మొదలు కానుంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా మిక్కి జే మేయర్ ను ఎంపిక అయ్యారు. ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరమ్మాయిల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కొత్తవాళ్లు నటిస్తారు. ఇందుకోసం స్టార్ హంట్ నిర్వహిస్తున్నారు.

దిల్‌రాజు మాట్లాడుతూ ''కుర్రకారు మనోభావాల్ని ఆవిష్కరించే కథ ఇది. సాయికిరణ్‌ చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. రచయిత అబ్బూరి రవితో కలిసి ఆ కథని మరింత బాగా తీర్చిదిద్దాం. ఈ చిత్రంతో కొద్దిమంది సాంకేతిక నిపుణులను కూడా పరిచయం చేస్తున్నాం. నటీనటుల కోసం ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ఈ నెల 15, 16 తేదీల్లో విజయవాడ, వరంగల్‌లో, 25న హైదరాబాద్‌లో ఆడిషన్స్‌ నిర్వహిస్తామ''ని తెలిపారు.

Dil Raju hunting newcomers for Kerintha

సాయికిరణ్‌ అడవి మాట్లాడుతూ... ''ఈ కథపై ఎప్పట్నుంచో కసరత్తులు సాగుతున్నాయి. అబ్బూరి రవి మాతో కలవగానే కథ కొత్తరూపం సంతరించుకొంది'' అన్నారు. ఏప్రిల్‌ నుంచి షూటింగ్ ప్రారంభిస్తారు. ఎడిటర్ గా మధు, సినిమాటోగ్రాఫర్ గా విశ్వ, కొరియోగ్రాఫర్ గా విజయ్ ని ఈ మూవీతో పరిచయం చేస్తున్నారు.

''ఇదివరకు మా సంస్థలో చిన్న సినిమాల్ని తెరకెక్కించాం. కొంతకాలంగా స్టార్‌ హీరోల చిత్రాలకే పరిమితమయ్యాం. ఐదేళ్ల తర్వాత మళ్లీ 'కేరింత' పేరుతో ఓ చిన్న చిత్రాన్ని మొదలుపెడుతున్నాం'' అన్నారు దిల్‌రాజు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్‌, ఛాయాగ్రహణం: విశ్వ, కూర్పు: మధు, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సహనిర్మాతలు: శిరీష్‌-లక్ష్మణ్‌.

English summary
Producer Dil Raju is currently busy searching for fresh faces for his movie titled as Kerintha, which will go on floors in December. Dil Raju & Sai Kiran are looking to introduce some fresh faces with this Kerintha and will be conducting auditions for the registered new comers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu