For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అది నాకు తీరని లోటు.., వాళ్లను కాపాడుకుంటా, నిర్మాతగా సక్సెస్.. కానీ!: దిల్ రాజు

  |

  ప్రతీ శుక్రవారం జాతకాలు మారిపోయే ఇండస్ట్రీలో 22ఏళ్లుగా విజయవంతంగా నిలదొక్కుకోవడమంటే మాటలు కాదు. డిస్ట్రిబ్యూషన్ నేపథ్యం నుంచి సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన దిల్ రాజు ఎన్నో ఒడిదుడుకుల్ని అధిగమించి తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.

  నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా.. తన ప్రస్థానం గురించి, సినీ నిర్మాణంలో ఉన్న లోటుపాట్ల గురించి, తన కొత్త ప్రాజెక్టుల గురించి కూలంకషంగా మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో తన సక్సెస్ సీక్రెట్ పై కూడా దిల్ రాజు స్పందించారు. ఆ విశేషాలు మీకోసం..

   సక్సెస్ మంత్ర:

  సక్సెస్ మంత్ర:

  తన సక్సెస్ గురించి వివరిస్తూ.. ప్రేక్షకుడి నాటి పట్టుకోవడంలోనే విజయ రహస్యం ఉందన్నారు దిల్ రాజు. 'ఇక్కడ రహస్యమేది లేదు. ప్రేక్షకులకు ఏమి కావాలో, ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో అనేది తెలుసుకుని.. వాళ్ల పల్స్ ప్రకారం సినిమాలు తీయాలని అనుకుంటాను' అని చెప్పారు.

  'నేనొక్కడినే కాదు.. నాతో పాటు మా టీమ్ కూడా సినిమా కథల విషయంలో ఎక్కువ కేర్ తీసుకుంటారు. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేస్తుంటాను.' అని తెలిపారు.

   వాళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత:

  వాళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత:

  ఈ ఏడాది తమ బ్యానర్ లో విడుదలైన సినిమాలు వాటి గెలుపోటములపై దిల్ రాజు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. శతమానం భవతి, డీజే, రాజా ది గ్రేట్, ఫిదా.. ఈ ఏడాది మా నుంచి వచ్చిన సినిమాలు అని చెబుతూ.. డీజే సినిమాకు రెండు మూడు ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు రాలేదన్నారు.

  డీజే నష్టాలు ఫిదాతో భర్తీ అయ్యాయని చెప్పారు. ఒక డిస్ట్రిబ్యూటర్ గా సినిమా పంపిణీలో కష్టాలను గుర్తెరిగినవాడిగా.. డిస్ట్రిబ్యూటర్లను కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్లను కాపాడుకోవడానికే ప్రయత్నిస్తానని అన్నారు. తన వద్ద సినిమాలు కొన్న డిస్ట్రిబ్యూటర్లంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు.

   అది నాకు తీరని లోటు:

  అది నాకు తీరని లోటు:

  ఈ ఏడాది తన అర్ధాంగిని కోల్పోవడం తీరని లోటు అని దిల్ రాజు ఆవేదన చెందారు. నిర్మాతగా ఈ ఏడాది విజయాలను అందుకున్నా.. వ్యక్తిగతంగా, పంపిణీదారుడిగా నష్టాలే మిగిలాయని ఆయన పేర్కొనడం గమనార్హం. డిస్ట్రిబ్యూషన్ లో కొన్ని సినిమాలు మిగిల్చిన నష్టాలు తీవ్రంగా భయపెట్టాయని చెప్పారు. నిర్మాతగా విజయాలు అందుకోవడంతో డిస్ట్రిబ్యూషన్ నష్టాలు పెద్దగా కనిపించడం లేదన్నారు.

   వాటికి డబ్బు రాదు.. ప్రతీరోజూ యుద్దమే:

  వాటికి డబ్బు రాదు.. ప్రతీరోజూ యుద్దమే:

  ఇండస్ట్రీలో మీకింత సక్సెస్ రేటు ఉంది కదా?.. ప్రయోగాత్మకంగా కొత్త జానర్ సినిమా చేయొచ్చు కదా.. అని చాలామంది అడుగుతుంటారని దిల్ రాజ్ చెప్పుకొచ్చారు. అయితే ప్రయోగాత్మక సినిమాలకు పేరు వస్తుంది తప్పితే.. డబ్బు వెనక్కి రావడం లేదని తెలిపారు.

  సినిమా విడుదలైన కొన్ని రోజుల్లోనే డిజిటల్ వేదికల్లో ప్రదర్శితం కావడంపై నిర్మాతలంతా కూర్చొని ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. సినిమా నిర్మించడం, పైరసీని తట్టుకోవడం, ప్రేక్షకుడిని థియేటర్ కు రప్పించాలని చూడటం.. ఇలా నిర్మాతకు ప్రతీరోజు యుద్దమేనని గుర్తుచేశారు.

   కొత్త దర్శకులతో:

  కొత్త దర్శకులతో:

  వచ్చే ఏడాది తమ సంస్థ నుంచి ఇద్దరు కొత్త దర్శకులు పరిచయం కాబోతున్నారని దిల్ రాజు తెలిపారు. అలాగే మహేష్ బాబు-వంశీ పైడిపల్లి కాంబినేషన్, నితిన్ శర్వానంద్ హీరోలుగా 'దాగుడు మూతలు',నితిన్ హీరోగా 'శ్రీనివాస కళ్యాణం' సినిమాను నిర్మించబోతున్నట్లు తెలిపారు.

  ఇక డిసెంబర్ 21న విడుదలవుతోన్న ఎంసీఏ చిత్రంతో ఈ ఏడాదిని విజయవంతంగా పూర్తి చేస్తామని దిల్ రాజు ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమాలో చివరి 15నిమిషాలు కథా, కథనం కొత్త అనుభూతిని కలిగిస్తాయన్నారు. శ్రేయాభిలాషుల సలహా మేరకే దర్శకుడు శంకర్‌తో చేయాలనుకున్న 'భారతీయుడు 2' సినిమా ఆలోచన విరమించుకున్నానని చెప్పారు.

  English summary
  Dil Raju is one of the important pillar defining the trends of Telugu movie Industry. As he is turning 47, he has shared some interesting details on the current scenario of Telugu Movie Industry.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X