»   » అఫీషియల్: దేవిశ్రీ హీరోగా దిల్ రాజు సినిమా

అఫీషియల్: దేవిశ్రీ హీరోగా దిల్ రాజు సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆయన్ను హీరోగా పరిచయం చేస్తూ సినిమా నిర్మించబోతున్నాడు. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించబోతున్నాడు. రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా పని చేయనునప్నారు. దిల్ రాజు ఈ విషయాలను అఫీషియల్ గా ప్రకటించారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు.

Dil Raju to launch Devi Sri Prasad soon

ఇటీవల ఇంటర్వ్యూలో దేవిశ్రీ మాట్లాడుతూ...
హీరోగా నటించమని అవకాశాలు కూడా వస్తున్నాయని దేవిశ్రీ ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ ఆఫర్స్ వస్తున్నాయని తెలిపారు. దిల్ రాజు గారు, అశ్వినీ దత్ గారు, అల్లు అరవింద్ గారు, తమిళంలో థాను, జ్ఞానవేల్ రాజాగారు ఇలా చాలా మంది అడుగుతున్నారు. అయితే వింటున్న కథల్లో నాకు బాగా నచ్చితేనే చేయాలని ఉంది.

మన ఇండస్ట్రీలో ఇప్పటికే మంచి స్టార్స్ ఉన్నారు. హీరోగా నటించి ఏదో చేయాలని కాదు. మ్యూజిక్ షోలు ఇవ్వడం వల్ల ప్రేక్షకుల్లో ఓ ఇమేజ్ ఏర్పడింది. నా బాడీ లాంగ్వేజ్ అందరికీ తెలుసు. నా బాడీ లాంగ్వేజ్ కి తగిన కథ వస్తే చేస్తాను. నా సినిమాలకు నేనే మ్యూజిక్ ఇస్తాను అన్నారు.

English summary
Dil Raju is all set to launch Devi Sri Prasad as hero soon. This film will be directed by Sukumar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu