For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దిల్ రాజు మాట తప్పాడా?: గుణ శేఖర్ కి షాక్

  |

  వరుస ఫెయిల్యూర్స్ తో సతమతమై పోయి బాగా కుంగిపోయిన గుణశేఖర్ తనా పూర్తి శక్తిని కూడగట్టుకొని తీసిన సినిమా రుద్రమదేవితో మరోసారి ఇంకో హిట్ కొట్టి నిలదొక్కుకున్నాడు. రుద్రమ దేవి మళ్ళీ పాత గుణశేఖర్ ని తిరిగి తెచ్చిందనటం లో ఏమాత్రం సందేహం లేదు. ఈ పీరియాడికల్ హిట్ తో ఇంకోసారి లైం లైట్లోకి వచ్చే ప్రయత్నం చేసిన గుణశేఖర్ ఆ సినిమా ఎండ్ కార్డ్ లో ఈ సినిమా కొనసాగింపుగా "ప్రతాపరుద్రుడు" సినిమా ఉంటుందని ఎనౌన్స్ చేశాడు.

  ఇక రుద్రమదేవి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నఉత్సాహం లో నిర్మాత దిల్ రాజు ప్రతాపరుద్రుడు ని కూడా తానే ప్రొడ్యూస్ చేస్తానని చెప్పాడు. ఇండస్ట్రీ లోనే స్టార్ రేంజ్ ఉన్న దిల్ రాజు అభయం ఇచ్చాడు కదా అని ప్రతాపరుద్రుడు కథ మీద కూర్చున్న గుణశేఖర్ ఎంతో మంది హిస్టరీ ఫ్రొఫెసర్ల తోనూ, చరిత్ర పరిశోదకులతోనూ కలిసీ, ఎంతో పరిశోదన చేసీ దాన్ని పూర్తి చేశాడు.

  అయితే దిల్ రాజు మీద ఎన్నో ఆశలతో ఉన్న గుణశేఖర్ కు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడట రాజు. కథ సిద్ధం అయినా సినిమా స్క్రిప్ట్ తో ఏదైనా పెద్ద హీరోని ఒప్పించుకుని వస్తే తప్ప తాను సినిమా తీయనంటున్నాడట. దిల్ రాజు బ్యానర్ వాల్యూతో ప్రతాపరుద్రుడుని భారీ సినిమాగా తీర్చిదిద్దుదాం అనుకున్న గుణశేఖర్ కు ఇదో మింగుడు పడని వార్త అయ్యింది.

  Dil Raju to not going to produce Prataparudrudu

  ఇప్పటికే పీరియాడికల్ సినిమాల హవా గత రెండు సంవత్సరాలు గా నడుస్తూనే ఉంది. మళ్ళీ ఇప్పుడు బాహుబలి-2 తో రాజమౌళీ,గౌతమీ పుత్ర శాతకర్ణి తో క్రిష్ సిద్దంగా ఉన్నారు. ఈ సందర్భం లో ఇంకో చారిత్రక కథ తీయటం రిస్క్ అనుకున్నాడేమో దిల్ రాజు... తాను ఇప్పట్లో చేయనూ అని చెప్పకనే చెప్పినట్టున్నాడు.

  ఇక ప్రతాపరుద్రుడుగా ఎవరిని పెడదామా అన్న ఆలోచనతో గుణశేఖర్ ఆ పాత్రకి సరిపోయే పెద్ద హీరో ఎవరున్నారూ అని సెర్చ్ చేస్తున్నాడు. ప్రస్తుతం స్టార్ హీరోలు చూస్తే ప్రయోగాలు చేసి ఉన్న క్రేజ్ పోగొట్టుకునే పరిస్థితుల్లో లేరు. యోధులుగా కనిపించే ఇద్దరు హీరోలూ బాహుబలి లో బుక్కై ఉన్నారు ఈ దసలో రానా గానీ ప్రభాస్ గానీ ఈ సినిమా చేసినా ఖచ్చితంగా ఫలితాలలో మార్పు ఉంటుంది.

  ఇక మిగిలింది అల్లు అర్జున్ అయితే ఇప్పటికే రుద్రమ దేవిలో గోనగన్నారెడ్డి గా కనిపించిన అల్లు అర్జున్ అదెచ్ కథకు సంబందం ఉన్న ప్రతాప రుద్రుడు లో ఇంకో పాత్రలో కనిపించటం బావుండదు. మరి గుణశేఖర్ కు ఫైనల్ గా ఎవరు ఫిక్స్ అవుతారో చూడాలి.

  ఇక మొన్నటివరకూ గుణశేఖర్ ప్రస్తుతం ఓ చిన్న సినిమా తీసే ప్రయత్నాల్లో ఉన్నాడని.. దామోదర ప్రసాద్ ఆయనతో సినిమా తీసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనివచ్చిన వార్తల్లోనూ. నిజం లేకపోలేదు. ఇన్నాల్లూ దిల్ రాజు మీదే అన్ని ఆశలూ పెట్టుకున్న గుణశేఖర్ ఇప్పుడు రాజు ఇచ్చిన పంచ్ కి ఏం చేయాలో అర్థం కాక. ప్రస్తుతానికి ప్రతాప రుద్రుడిని పక్కన పెట్టి వేరే సినిమాల వైపు చూస్తున్నడట.

  మరి గుణశేఖర్ తీసేది ప్రతాపరుద్రుడా లేక కొత్త వారితో మరో చిన్న బ్యానర్ సినిమానా అని తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. ఎందుకంటే మంచి ప్రొడ్యూసర్ గనక ముందుకు వస్తే ప్రతాప రుద్రున్నే ముందుగా తెరమీదికి తెస్తాడు గుణశేఖర్. అయితే ఆ ముందుకొచ్చే నిర్మాత ఎవరన్నదే ఇప్పుడు అర్థం కాని సంగతి....

  English summary
  Dil raju not intrested in Director guNasheakar's new movie PrataparudruDu Now.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X