»   » జూ ఎన్టీఆర్‌కు మూడొచ్చింది... దిల్ రాజు హ్యాపీ!

జూ ఎన్టీఆర్‌కు మూడొచ్చింది... దిల్ రాజు హ్యాపీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌కు మూడొచ్చింది. దీంతో నిర్మాత దిల్ రాజుకు చాలా సంతోషంగా ఉన్నాడు. జూ ఎన్టీఆర్‌కు మూడొస్తే...దిల్ రాజుకు అంత సంబరం ఎందుకని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ స్టోరీ తెలుసుకోవాల్సిందే.

జూ ఎన్టీఆర్‌తో ఇప్పటికే బృందావనం సినిమా చేసి హిట్ కొట్టిన దిల్ రాజు మంచి లాభాలు సాధించాడు. జూనియర్ ఎన్టీఆర్ తాజా సినిమా 'రామయ్యా వస్తావయ్యా'కు నిర్మాత కూడా దిల్ రాజే. ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం జూ ఎన్టీఆర్‌తో మూడో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు దిల్ రాజు.

ఎన్టీఆర్ ఇప్పుడు ఓ రైటర్‌కి దర్శకుడుగా ప్రమోషన్ ఇస్తున్నారు. తనకు అశోక్, ఊసరవెల్లి చిత్రాల కథలు రాసిన వక్కంతం వంశీ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈచిత్రాన్ని కూడా దిల్ రాజే నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. జూ ఎన్టీఆర్‍‌ సినిమాలకు మంచి మార్కెట్ ఉండటంతో నిర్మాతగా అవకాశం దక్కించుకోవడానికి గట్టి పోటీ ఉన్నప్పటీకీ అందరినీ వెనక్కినెట్టి చాన్స్ కొట్టేసాడు దిల్ రాజు.

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పూర్తయిన తర్వాత బెల్లకొండ నిర్మించబోయే 'రభస' చిత్రంలో ఎన్టీఆర్ నటిస్తారు. ఆ తర్వాత వక్కతం వంశీతో చేయబోయే సినిమా తెరకెక్కే అవకాశం ఉంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

English summary
Young Tiger NTR is going to act in a film to be directed by writer Vakkantham Vamsi. The film has been confirmed and it will be produced by Dil Raju on Sri Venkateswara Creations banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu