»   » మరో నందమూరి హీరోతో దిల్ రాజు సినిమా

మరో నందమూరి హీరోతో దిల్ రాజు సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ తెలుగు నిర్మాత దిల్ రాజు తర్వలో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘పిల్లా నువ్వులేని జీవితం' ఫేం రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించబోతున్నాడు. ‘పటాస్' మూవీ తో విజయం అందుకున్న కళ్యాణ్ రామ్‌ని ఈ సినిమాలో సరికొత్తగా చూపించబోతున్నారట.

కళ్యాణ్ రామ్ ప్రస్తుతం...నటిస్తున్న చిత్రం ‘షేర్'. కళ్యాణ్ రామ్ గత సినిమా ‘కత్తి'కి దర్శకత్వం వహించిన మల్లికార్జున ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో మిస్ ఇండియా వరల్డ్-2012 వన్యా మిశ్రా హీరోయిన్. ఇప్పటికే ఈ చిత్రం టాకీ పార్టు పూర్తయింది. ఉన్నట్టుండి ఆమెను తీసేసి మరో హీరోయిన్ తో మళ్లీ సీన్లు రీ షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసం ‘లెజెండ్' చిత్రంలో నటించిన సోనాల్ చౌహాన్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. కొత్త హీరోయిన్ కాకుండా అందరికీ తెలిసిన ఫేస్ అయితే సినిమా ప్లస్సవుతుందనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారట.

Dil Raju produce Nandamuri Kalyanram's next Movie

సాయి నిహారిక సమర్పణలో విజయలక్ష్మి పిక్చర్స్ బ్యానర్ పై కొమర వెంకటేష్ నిర్మాణ సారధ్యంలో ‘షేర్' మూవీ తెరకెక్కుతోంది. షూటింగ్ దాదాపు పూర్తయినట్లే, కొన్ని సాంగులు మాత్రమే పెండింగులో ఉన్నాయని తెలుస్తోంది. ఈ సినిమాలో మరోసారి కళ్యాణ్ రామ్ పూర్తి మాస్ లుక్ లో కనిపించనున్నాడు. చాలా కాలం తర్వాత ‘పటాస్' సినిమాతో విజయం రుచి చూసిన కళ్యాణ్ రామ్ తన తర్వాతి సినిమాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

English summary
As per the most recent reports, noted producer Dil Raju can produce Nandamuri Kalyanram's next which can be directed by Ravi Kumar Chowdary.
Please Wait while comments are loading...