»   » రివ్యూలుకి బాధ పడటంలేదు: దిల్‌ రాజు

రివ్యూలుకి బాధ పడటంలేదు: దిల్‌ రాజు

Posted By:
Subscribe to Filmibeat Telugu

మీడియాలో రివ్యూలు వారి అభిప్రాయాలకు తగ్గ విధంగా రాశారు. అందుకు బాధ పడటంలేదు అంటున్నారు దిల్ రాజు. ఆయన నిర్మించిన మరో చరిత్ర రీమేక్ మొన్న గురువారం రిలీజైంది. ప్రమేషన్ చేయటానికి ఆయన మీడియాను కలిసారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ పై విధంగా చెప్పుకొచ్చారు. ఆయన మాటల్లోనే...ఈ సినిమాను జనం మధ్య కూర్చొని చూశాను. అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. అప్పుడనిపించింది. నేను తప్పు చేయలేదని. ప్రేక్షకులే నిజమైన న్యాయ నిర్ణేతలు. వారి తీర్పు భిన్నంగా ఉంటుంది. బాగాలేదు అన్న టాక్‌ నుంచి సెన్సేషన్‌ సృష్టించిన సినిమాలున్నాయి. 30 శాతం వసూళ్లతో మొదలై కలెక్షన్ల వరద సృష్టించిన సినిమాలున్నాయి. ఆ కోవలోకే మా 'మరోచరిత్ర' కూడా వస్తుంది. సినిమాకు ఇలాంటి డివైడ్‌ టాక్‌ రావడానికి పాత 'మరోచరిత్ర'పె కొంతమందికి ఉన్న మమకారం కారణం కావచ్చు. ఈ చిరు సమస్యలను ప్రేక్షకులే పరిష్కరిస్తారని నా నమ్మకం. ఒక లెజెండ్రీ ఫిలిం ఆధారంగా చేసుకొని ప్రయోగాత్మకంగా తీసిన సినిమా ఇది. ఒక పక్క ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు జరుగుతున్నా, మరో పక్క విద్యార్థులకు పరీక్షల సీజనైనా.. 80 శాతం కలెక్షన్లతో మా 'మరోచరిత్ర' దూసుకుపోతోంది. ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్‌' అని నిర్మాత దిల్‌రాజు అన్నారు. శిరీష్‌, లక్ష్మణ్ ‌లతో కలిసి ఆయన నిర్మించిన ఈ చిత్రంలో వరుణ్ ‌సందేశ్‌, అనిత, శ్రద్ధాదాస్‌ హీరో, హీరోయిన్లుగా చేసారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu