»   » కలెక్షన్స్ లేకపోయినా నిలబెట్టాలని దిల్ రాజు పాట్లు

కలెక్షన్స్ లేకపోయినా నిలబెట్టాలని దిల్ రాజు పాట్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళ దర్శకుడు శంకర్ నిర్మించిన 'ఈరం' చిత్రాన్ని తెలుగులోకి ప్రముఖ నిర్మాత దిల్ రాజు'వైశాలి'పేరుతో డబ్బింగ్ చేసి క్రిందటి వారం విడుదల చేసిన సంగతి తెలిసిందే.అయితే ఆ చిత్రం మొదటి రోజునుంచి కలెక్షన్స్ లేకుండా పోయింది.తన డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ తో,తన గుడ్ విల్ తో సినిమాను నిలబెడతానని శంకర్ కి మాట ఇచ్చి ,సినిమాలో కొన్ని సీన్స్ ఎడిట్ చేసి మరీ తెచ్చిన సినిమా ఇలా ప్రేక్షకులు పట్టించుకోకపోవటం దిల్ రాజుని నిరుత్సాహపరిచింది.గతంలోనూ ఆకాశమంత చిత్రం కూడా అలాగే తమిళం నుండి తీసుకొచ్చి స్టైయిట్ చిత్రంలా బిల్డప్ ఇచ్చి విడుదల చేసారు కానీ వర్కవుట్ కాలేదు.దాంతో ఎలాగయినా ఈ సారి వైశాలిని నిలబెట్టాలని..మీడియాలో ఊదరకొడుతున్నారు.

ఈ సినిమా గురించి దిల్ రాజ మీడియాతో మాట్లాడుతూ... 'ఈ చిత్ర విజయాన్ని నేను ముందే ఊహించాను.ఫస్టాఫ్ యూత్‌ని, సెకెండాఫ్ ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటోంది. మా సంస్థ ద్వారా ఈ సినిమా విడుదల చేస్తే బాగుంటుందనుకున్న శంకర్ నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేసినందుకు ఆనందంగా ఉంది. ఇది డబ్బింగ్ సినిమా అయినా 'ఆర్య', 'బొమ్మరిల్లు' చిత్రాల తరహాలో ఉందని అందరూ ప్రశంసిస్తున్నారు. హీరోగా నటించిన ఆది పినిశెట్టి, హీరోయిన్ సింధు మీనన్‌కు మంచి పేరు వచ్చింది. ఆంధ్రా ఏరియాలో రెస్పాన్స్ బాగుంది. మల్టీప్లెక్స్‌లో కూడా బాగా ఆడుతోంది. త్వరలో ప్రింట్ల సంఖ్య పెంచుతాం' అన్నారు.అదీ సంగతి.

English summary
Producer Dilraju held a successmeet of Tamil to Telugu dubbed film 'Vaishali'. In Tamil, this suspense and horror flick released as 'Eeram' and it was produced by director Shankar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu