»   » దిల్ రాజు చేతికి మణి రత్నం - కార్తీ ‘డ్యూయెట్’

దిల్ రాజు చేతికి మణి రత్నం - కార్తీ ‘డ్యూయెట్’

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రఖ్యాత దర్శకులు మణి రత్నం గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఆయన తీసిన ఎన్నో చిత్రాలు తెలుగు లో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కార్తీ తో డ్యూయెట్ అనే ఒక ఏక్షన్ లవ్ స్టోరీ ని తెరకెక్కిస్తున్నారు మణి రత్నం. ఈ చిత్రాన్ని తెలుగు లో ప్రఖ్యాత నిర్మాత దిల్ రాజు గారు విడుదల చేస్తున్నారు.

రోజా సినిమా తరువాత మణి రత్నం రూపొందిస్తోన్న ఏక్షన్ లవ్ స్టోరీ జానర్ సినిమా ఇదే కావటం విశేషం. ఈ చిత్రానికి "మొజార్ట్ అఫ్ మద్రాస్" ఏ . ఆర్ . రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.మణి రత్నం రెహమాన్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మ్యూజిక్ ఆల్బమ్స్ ని తలపించే అద్భుతమైన మ్యూజిక్ ఈ చిత్రం లో ఉంటుంది అని చిత్ర బృందం చెబుతోంది.

Dil Raju to release Karthi - Mani Ratnam's 'Duet'

"ఓకే బంగారం సినిమా షూటింగ్ ప్రారంభం లో నే మణి రత్నం గారు నాకు స్టోరీ చెప్పారు. చాలా నచ్చి తెలుగు లో రిలీజ్ చేశాను. ఇప్పుడు అదే మాదిరిగా మళ్ళీ ఈ డ్యూయెట్ సినిమా స్టోరీ షూటింగ్ ప్రారంభం లో చెప్పారు. ఇది మణి రత్నం గారు అందించే మరో సూపర్ హిట్ అనే నమ్మకం ఉంది. అందుకే తెలుగు లో రిలీజ్ చేస్తున్నాను. మార్చ్ 2017 లో సినిమా రిలీజ్ ఉంటుంది", అని నిర్మాత దిల్ రాజు తెలిపారు.

Dil Raju to release Karthi - Mani Ratnam's 'Duet'

డిసెంబర్ లో ఒక ఫారిన్ షెడ్యూల్ తో చిత్రం షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఇప్పటి దాకా చెన్నై, హైదరాబాద్, లేహ్ లడఖ్ ల లో డ్యూయెట్ ను చిత్రీకరించారు. ఈ చిత్రానికి సంగీతం - ఏ . ఆర్ . రెహమాన్, సినిమాటోగ్రఫీ - రవి వర్మన్, ఎడిటింగ్ - శ్రీకర్ ప్రసాద్, కథ - స్క్రీన్ప్లే - దర్శకత్వం - మణి రత్నం, నిర్మాత - దిల్ రాజు, సమర్పణ : శిరీష్.

English summary
The maestro of Romance, director Mani Ratnam, is making an action love story with Karthi and Aditi Rao Hydari. This movie is going to release in Telugu as 'Duet' and noted producer Dil Raju is going to release the Telugu version of the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu