»   » కమల్, శంకర్‌తో భారతీయుడు2.. 180 కోట్లతో దిల్ రాజు సినిమా

కమల్, శంకర్‌తో భారతీయుడు2.. 180 కోట్లతో దిల్ రాజు సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu

సెన్సేషనల్ హిట్టైన భారతీయుడు చిత్రం తర్వాత దాదాపు 21 ఏళ్లకు విలక్షణ నటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్ మరోసారి జతకట్టనున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో రానున్న భారతీయుడు చిత్రానికి టాలివుడ్ ప్రముఖుడు దిల్ రాజు నిర్మాత. 1995 ఘనవిజయం సాధించిన భారతీయుడు చిత్రానికి ఇది సీక్వెల్. ఈ ప్రాజెక్ట్ గురించి అదివారం కమల్ హాసన్ అధికారికంగా ప్రకటన చేయడం గమనార్హం.

 దిల్ రాజు నిర్మాతగా భారతీయుడు2

దిల్ రాజు నిర్మాతగా భారతీయుడు2

శంకర్ డైరెక్షన్‌లో నా తదుపరి చిత్రం ఫ్రారంభం కానున్నది. ఆ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్. తెలుగు తమిళ భాషల్లో రూపొందుతుంది అని కమల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

 కమల్, శంకర్ కాంబినేషన్‌లో

కమల్, శంకర్ కాంబినేషన్‌లో

డైరెక్టర్ శంకర్, కమలహాసన్‌ కాంబినేషన్‌లో 1996లో రిలీజ్ అయిన 'భారతీయుడు' చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. 70 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి భారతీయుడు గెటప్‌లో కమల్ లంచం తీసుకునే అవినీతి పరుల పని పడతారు. అయితే అప్పట్లో ఈ చిత్రం రికార్డు స్థాయి కలెక్షన్లను రాబట్టడమే కాదు, పలు అవార్డులను కూడా అందుకుంది. కాగా ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా 'భారతీయుడు 2'ను శంకర్ తెరకెక్కించనున్నారు.

 ఆనందంగా ఉంది.. దిల్ రాజు

ఆనందంగా ఉంది.. దిల్ రాజు

భారతీయుడు2 చిత్రంపై నిర్మాత దిల్ రాజు తన ఫేస్‌బుక్ ఖాతాలో స్పందించారు. ఈ సినిమాకు గాను డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్‌లతో కలసి పనిచేయడం ఆనందంగా ఉంది. ప్రస్తుతం శంకర్ 2.0 సినిమా షూటింగ్‌లో బిజీ ఉన్నారు. కమల్ విశ్వరూపం 2, శభాష్ నాయుడు చేస్తున్నారు. ఈ సినిమాలు పూర్తి కాగానే భారతీయుడు 2 సెట్స్‌పైకి వెళ్తుంది అని దిల్ రాజు ట్వీట్ చేశారు.

 180 కోట్ల బడ్జెట్‌తో..

180 కోట్ల బడ్జెట్‌తో..

కాగా భారతీయుడు 2 ను రూ.180 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించనున్నట్టు తెలిసింది. మొదటి పార్ట్‌లోలాగానే ఇందులో కూడా అవినీతి నిర్మూలన అనే కథాంశంతో సినిమా సాగుతుందని సమాచారం. ఈ క్రమంలోనే సినిమాను తెలుగు, తమిళంలో ఏకకాలంలోతీయాలని చిత్ర నిర్మాత భావిస్తున్నట్టు తెలిసింది.

English summary
Actor Kamal Haasan annoucned that his next project would be with director Shankar and the movie would be named Indian-2. Kamal Haasan announced at an event today that his next project would be directed by Shankar and produced by Dil Raju. The film, Indian 2, would be a sequel to Kamal and Shankar's last collaboration, Indian, which released in 1996 and became a blockbuster.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu