»   » దిల్ రాజుకీ నాగార్జునకీ మధ్య కోల్డ్ వార్..? ఎందుకిన్ని కోపాలూ అంటే....

దిల్ రాజుకీ నాగార్జునకీ మధ్య కోల్డ్ వార్..? ఎందుకిన్ని కోపాలూ అంటే....

Posted By:
Subscribe to Filmibeat Telugu

అక్కినేని నాగార్జునా నాగార్జునా కీ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కీ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందా..?? ఇప్పటికి ఉన్న సమాచారం ఒప్రకారం అయితే ఔను అనే చెప్పుకోవాలి మరి. ఇన్నళ్ళూ కాస్త మరుగున ఉన్న ఈ విభేదాల కథ ఇప్పుడు జనం మధ్య కివచ్చింది. రీసెంట్గా నాగార్జున, నాగచైతన్యతో మల్టీస్టారర్‌ తీయబోతున్నట్టు మీడియాకి దిల్‌ రాజు న్యూస్‌ లీక్‌ చేసాడు. సాధారణంగా అంత పెద్ద నిర్మాత ఈ తరహా ఇన్‌ఫర్మేషన్‌ పాస్‌ చేస్తే ఏ హీరో అయినా క్యూరియాసిటీ కొద్దీ కథేంటో తెలుసుకోవాలని అనుకుంటాడు. కానీ నాగార్జున మాత్రం ట్విట్టర్‌లోకి వచ్చి 'ఇది నాకు కూడా న్యూసే' అంటూ వెటకారంగా ట్వీట్‌ చేసాడు.

అయితే దీని వెనుక ఇప్పటికే దిల్ రాజు కి ఒక జలక్ ఇచ్చాడు నాగ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో నాగ్ ఓ సినిమా చేయాల్సి ఉంది. అప్పటికే రవితేజ ఆ ప్రాజెక్టును రిజెక్ట్ చేశాడు. అదే స్టోరీని నాగార్జున కూడా అప్పట్లో రిజెక్ట్ చేశాడు., అంతేకాదు గతం లో ఒకసారి అఖిల్ మొదటి సినిమా ప్రసక్తి వచ్చినప్పుడు కూడా 'భాయ్‌' దర్శకుడు వీరభద్రమ్‌పై నాగార్జున బాంబ్‌ పేల్చాడు. తాను నటించిన అతి చెత్త చిత్రమని, అది చేసినందుకు సిగ్గు పడుతున్నానని నాగార్జున చెప్పడంతో వీరభద్రమ్‌ లోలోపల కుమిలిపోతున్నాడు.

తనకి ఆ సినిమాపై ఉన్న అభిప్రాయాన్ని నాగార్జున అలాగే దాచి పెట్టి ఉంచాల్సిందని, అనవసరంగా అందరికీ తెలిసేట్టు చేసి తన పరువు కూడా తీసి పారేసాడని వీరభద్రమ్‌ ఫీలవుతున్నాడు. నాగార్జున కేవలం అతనిపైనే కాకుండా దిల్‌ రాజుకి కూడా షాకిచ్చాడు. నాగచైతన్యని వేరే నిర్మాత సినిమాతో పరిచయం చేసి తప్పు చేసానని, అఖిల్‌ విషయంలో ఆ తప్పు చేయనని, అతని మొదటి సినిమా తానే నిర్మిస్తానని నాగార్జున అన్నాడు.

Dil raju shocked with nagarjuna comments

ఇదంతా పాత కథే. కొత్తగా ఇప్పుడు మరోసారి దిల్ రాజుకు ఝలక్ ఇచ్చాడు మన్మధుడు. రీసెంట్ గా మరో కథను కూడా రిజెస్ట్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. ఇలా నాగార్జున ఎందుకు చేస్తున్నాడు అంటే వేరే కథ ఒకటి వినిపిస్తోంది. దిల్‌ రాజు విషయంలో నాగ్‌ అంత కఠినంగా వ్యవహరించడానికి కారణమేంటి? అనే విషయం పై ఒక టాక్ అయితే వినిపిస్తోంది. ఇందులో నిజమెంతో తెల్యదు కానీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న విషయం మాత్రం ఇది.

నాగచైతన్యని 'జోష్‌' చిత్రంతో ఇంట్రడ్యూస్‌ చేసే అవకాశాన్ని అందరినీ వదిలేసి దిల్‌ రాజుకి ఇస్తే, అతను నమ్మకాన్ని నిలబెట్టుకోలేదు. ఆ చిత్రం మిస్‌ఫైర్‌ అవడంతో ఆరంభమే ట్రాక్‌ తప్పి చైతన్య ఇంతవరకు స్టార్‌గా ఎదగలేదు. అదే కారణం మీద దిల్‌ రాజు అంటే నాగ్‌ ఇంకా గుర్రుగానే ఉన్నాడని, అందుకే ఇలా చేస్తున్నాడని గుసగుసలాడుకుంటున్నారు.

English summary
Nagarjuna shocked Dil Raju with a tweet, He wrote “I am reading & hearing the news that chai and I are doing a film together again..hmmm!! This is news to me also”. that says he is unaware of the project and he said that it is a news for him too.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu