For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాలయ్య, చరణ్ బరిలో ఉన్నారు.. అయినా ఫర్వాలేదు: ఎఫ్ 2 వేడుకలో దిల్ రాజు అల్టిమేట్ స్పీచ్

|

విక్టరీ వెంకటేశ్‌, మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ హీరోలుగా తమన్నా, మెహరీన్‌ హీరోయిన్స్‌గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మించిన 'ఎఫ్‌ 2- ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌' ఆడియో రిలీజ్ వేడుక విశాఖపట్నంలో జరిగింది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన పాటలను ఆర్‌.కె.బీచ్‌లో జరిగిన విశాఖ ఉత్సవంలో విడుదల చేశారు. ఆడియో సీడీలను ఆంధ్రప్రదేశ్‌ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు విడుదల చేశారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ... 2004 డిసెంబర్ 31న న్యూఇయర్ బన్నీ, నేను ఇక్కడే చేసుకున్నాం. ఆ ప్లేసును చూసుకుంటూ ఈ వేడుకకు వచ్చాను. 2017 సంక్రాంతికి 3 సినిమాలు రిలీజైనపుడు చాలా పెద్ద కాంపిటీషన్ అని అంతా ఫీలయ్యాం. కానీ గౌతమీ పుత్ర శాతకర్ణి క్లాసిక్ సినిమా అయింది. మెగాస్టార్ చిరంజీవి గారి ఖైదీ నెం.150 ఇండస్ట్రీ హిట్టయింది. శతమానం భవతి మంచి హిట్టయి నేషనల్ అవార్డు దక్కించుకుంది, ఈ సారి కూడా మూడు సినిమాలో బరిలో ఉన్నాయని దిల్ రాజు తెలిపారు.

మూడు సినిమాలు హిట్టవ్వాలి

మూడు సినిమాలు హిట్టవ్వాలి

2019లొ మళ్లీ మూడు సినిమాలు పోటీ పడుతున్నాయి. బాలయ్యగారి ‘ఎన్టీఆర్ బయోపిక్', రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ', మా ‘ఎఫ్ 2'... ఈ సంక్రాంతికి కూడా ఈ మూడు సినిమాలు హిట్టవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

Poll: 2018 ఉత్తమ తెలుగు చిత్రం

ఇద్దరితో చాలా చాలా ఎంజాయ్ చేశాను

ఇద్దరితో చాలా చాలా ఎంజాయ్ చేశాను

వెంకటేష్ గారితో సీతమ్మ వారిట్లో సిరిమల్లె చెట్టు మా బేనర్లో సంక్రాంతికి విడుదలైంది. వరుణ్‌తో ‘ఫిదా' సినిమా చేశాం. వాళ్లిద్దరూ కలిస మా బేనర్లో మల్టీస్టారర్ సినిమాగా రాబోతోంది. ఈ సినిమా జరుగుతున్నన్ని రోజులు నిర్మాతగా కాకుండా స్నేహితుడిగా వెళ్లి సరదాగా గడిపాను, ఎంజాయ్ చేశాను. ఆ ఇద్దరు హీరోలు నిర్మాతలకు అంత కంఫర్ట్ క్రియేట్ చేస్తారు. వెంటనే స్క్రిప్టు దొరికితే వెంకీ గారితో మరో సినిమా చేయాలని ఉంది.

Poll: ఉత్తమ విమర్శకుల ప్రశంసలు పొందిన 2018 తెలుగు చిత్రం

చిరంజీవి గారి వద్ద మంచి లక్షణాలు నేర్చుకుని వరుణ్ ఎదుగుతున్నాడు

చిరంజీవి గారి వద్ద మంచి లక్షణాలు నేర్చుకుని వరుణ్ ఎదుగుతున్నాడు

వరుణ్ ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ మెంబర్. చిరంజీగారి వద్ద నుంచి మంచి లక్షణాలు నేర్చుకుని కొత్త కొత్త సినిమాలు ట్రై చేస్తూ ఎదుగుతున్న వరుణ్ మా ఎఫ్ 2 ద్వారా ఫ్యామిలీ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతారు.

Poll: ఉత్తమ తెలుగు నటుడు 2018

వెంకీ కూలి నెం.1 డ్రెస్... వరుణ్ ‘తమ్ముడు’ డ్రెస్

వెంకీ కూలి నెం.1 డ్రెస్... వరుణ్ ‘తమ్ముడు’ డ్రెస్

ఎఫ్ 2లో ఓ సాంగులో వెంకటేష్ గారు కూలి నెం.1 డ్రెస్ వేస్తే... వరుణ్ తమ్ముడు సినిమాలోని పవర్ స్టార్ డ్రెస్ వేశారు. అనిల్ కథ చెబుతున్నపుడు చాలా నవ్వొచ్చింది. ప్రతి ఒక్కరి జీవితంలో భార్యతో ఫన్ ఉంటుంది, ఫ్రస్టేషన్ ఉంటుంది. దాంట్లో నుంచి అతడు కథను తయారు చేశాడు. ఈ సినిమా కథ విన్నపుడే హిట్టవుతుందని తెలుసు. దానికి తగ్గట్లు ఇద్దరు హీరోలు, మంచి హీరోయిన్స్‌, టెక్నీషియన్స్‌ బాగా కుదిరారు. అనిల్‌తో ఇంతకు ముందు చేసిన సుప్రీమ్‌, రాజాదిగ్రేట్‌ కమర్షియల్‌ సినిమాలు అయితే ఎఫ్‌ 2 పక్కా ఫ్యామిలీ సినిమా.

Poll: ఉత్తమ తెలుగు నటి 2018

ఇటు అంధ్రా అల్లుడు, అటు తెలంగాణ అల్లుడు

ఇటు అంధ్రా అల్లుడు, అటు తెలంగాణ అల్లుడు

సినిమా థియేటర్‌కు మీరు ఫ్యామిలీతో వెళితే రెండున్నర గంటలు నవ్వుకుంటారు. అందుకనే సంక్రాంతి అల్లుళ్లు వస్తున్నారు అనే మరో ట్యాగ్‌లైన్‌ను కూడా అనిల్‌ యాడ్‌ చేశాడు. ఒకరు ఆంధ్ర అల్లుడైతే, ఒకరు తెలంగాణ అల్లుడు. వరుణ్ తో తెలంగాణ స్లాంగ్ మాట్లాడించారు. ఇంట్లో ఇల్లాలు- వంటింట్లో ప్రియురాలు, నువ్వునాకు నచ్చావ్‌లో వెంకటేష్‌గారిని చూస్తున్నట్లు ఉంటుంది. అనిల్‌తో ఈ సారి హ్యాట్రిక్‌ కొట్టబోతున్నాం.

Poll: ఉత్తమ తెలుగు ప్రతినాయకుడు 2018

దేవిశ్రీతో పది సినిమాలు చేస్తే 9 హిట్లు

దేవిశ్రీతో పది సినిమాలు చేస్తే 9 హిట్లు

రాక్‌స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌తో ఆర్య నుండి ఎఫ్‌2 వరకు పది సినిమాలు. ముందు తొమ్మిది సినిమాలు సక్సెస్‌ఫుల్‌ సినిమాలయ్యాయి. అతడు లిరిక్ దగ్గర నుంచి ప్రతి విషయంలో కేర్‌ తీసుకుంటాడు. అందుకే మా కాంబినేషన్‌ కంటిన్యూ అవుతుంది.

English summary
Dil Raju Speech At F2 Audio Launch. F2 Fun and Frustration Movie Audio Launch event at Visakhapatnam. Venkatesh, Varun Tej, Ganta Srinivasa Rao, Anil Ravipudi, Dil Raju, Satyam Rajesh, Hari Teja, Devi Sri Prasad, Sri Mani, Kasarla Shyam, Hariharasudhan, Suma at the event.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more