»   » 'ఆది' తో ఎన్టీఆర్ స్టార్ , ఇప్పుడు 'బృందావనం' తో ... దిల్ రాజు

'ఆది' తో ఎన్టీఆర్ స్టార్ , ఇప్పుడు 'బృందావనం' తో ... దిల్ రాజు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆది ఎన్టీఆర్ ని స్టార్‌ను చేస్తే, సింహాద్రి సూపర్‌స్టార్‌ను చేసింది. ఈ బృందావనం ఆయన అంతస్తును మరింత పెంచి, కొత్త ఇమేజ్‌ను తీసుకు వస్తుంది అన్నారు దిల్ రాజు. ఎన్టీఆర్ తో ఆయన రూపొందించిన తాజా చిత్రం బృందావనం మారిన రిలీజ్ డేట్ ని ప్రకటిస్తూ ఆయన అలా స్పందించారు. అలాగే బృందావనం.. ఫ్యామిలీ ప్రేక్షకులకు ఆయనను మరింత దగ్గర చేస్తుందీ చిత్రం. రెండేళ్ల క్రితం ఎన్టీఆర్‌కి ఈ చిత్రకథ చెప్పాడు వంశీ. అప్పటినుంచి ఈ కథమీద వర్కవుట్ చేశాం.

సాధారణంగా మా చిత్రాల రీరికార్డింగ్ 15,16 రోజులు చేస్తాం. కానీ ఈ సినిమాలో నేపథ్య సంగీతానికి ప్రాధాన్యత ఉండటంతో 29 రోజులు చేశాం అన్నారు. వంశీ, సంగీత దర్శకుడు తమన్ కూర్చుని మ్యూజిక్ బోర్డ్‌లా తయారు చేసుకుని రీరికార్డింగ్ చేస్తున్నారు. అలాగే ఛాయాగ్రాహకుడు చోటా కె.నాయుడు 14 నెలలుగా ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. ప్రతి టెక్నీషియన్ ప్రాణం పెట్టి పనిచేయడంతో సినిమా బాగా వచ్చింది. మరో మూడు నాలుగు రోజుల్లో తొలి కాపీ వస్తుంది. ఈ నెల 14న విడుదల చేస్తాం. సినిమా చూసి నందమూరి అభిమానులు పండగ చేసుకుంటారు' అన్నారు. కాజల్, సమంతా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu