»   » ప్రేక్షకులు ఓపెన్ మైండ్‌తో సినిమాను చూడాలి: దిల్ రాజు

ప్రేక్షకులు ఓపెన్ మైండ్‌తో సినిమాను చూడాలి: దిల్ రాజు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రయోగాత్మకంగా చేసిన హానెస్ట్ ఫిలిం ఇది. ప్రేక్షకులు కూడా ఓపెన్ మైండ్‌తో ఈ సినిమాను చూడాలి అంటున్నారు నిర్మాత దిల్ రాజు. ఆయన తాజా చిత్రం గగనం త్వరలో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పంధించారు. అలాగే కథ గురించి చెపుతూ..గగనం లో విహారించే ఓ విమానం హైజాక్‌కి గురైతే... అందులో ప్రయాణించేవారు ఎలాంటి మానసిక ఒత్తిడులకు లోనవుతారు? హైజాకర్ల బారి నుంచి వాళ్లు ఎలా బయటపడ్డారు? ఈ నేపథ్యంలో సాగే కథాంశంతో రూపొందుతోంది అన్నారు.

అలాగే ఇదొక థ్రిల్లింగ్ డ్రామా. ఇంటలిజెంట్ గేమ్‌కి యాక్షన్‌ని మేళవించి ఆసక్తికరంగా దర్శకుడు ఈ సినిమాను మలిచారు. కాందహార్ హైజాక్ ఇన్‌స్పిరేషన్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. తమిళంలో ప్రకాష్‌రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు అని వివరించారు. ఇక దర్శకుడు రాధామోహన్ మాట్లాడుతూ..కమాండోల జీవితాలు త్యాగాలతో ముడిపడి ఉంటాయని, ఎన్నో త్యాగాలు చేసి, ఎన్నో సాహసాలకు ఒడిగట్టి.. వాళ్లు హైజాకర్లను పట్టుకుంటే...ఏవేవో కారణాలు చూపించి వారిని గవర్నమెంట్ వదిలిపెట్టేస్తుందని, ఆ సమయంలో కమాండోల మానసిక స్థితి ఎలా ఉంటుందనే విషయాన్ని కూడా ఈ చిత్రంలో చర్చిస్తున్నామని చెప్పారు.

అక్కినేని నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఈ చిత్రం ఫిబ్రవరి రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌ మెంట్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, సనాఖాన్, పూనమ్‌కౌర్, డా.భరత్ రెడ్డి, రిషి, శ్రీలక్ష్మి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ మణి, ఫొటోగ్రఫి: కేవీ గుహన్.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu