»   » పివిపి కాదు.. దిల్ రాజు: మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ పూర్తి వరాలు

పివిపి కాదు.. దిల్ రాజు: మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ పూర్తి వరాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల ‘బ్రహ్మోత్సవం' సినిమా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పివిపి సంస్థ నిర్మిస్తోందంటూ గతంలో ప్రచారం జరిగింది. అయితే ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చిన అంశం. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు.

మహేష్ బాబు హీరోగా ‘బ్రహ్మోత్సవం' సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్లో నిర్మిస్తున్నట్లు శ్రీకాంత్ అడ్డాల చెప్పుకొచ్చారు. పూర్తి ఫ్యామిలీ ఎంటర్టెనర్ గా తెరకెక్కే ఈ చిత్రాన్ని మే 30న ప్రారంభించి 2016 సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు.

Dil Raju to produce Mahesh's Brahmotsavam

ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రకాష్ రాజ్, రావు రమేష్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. సినిమా పూర్తి స్తాయిలో ఫ్యామిలీ ప్రేక్షకులు మెచ్చే విధంగా ఉంటూనే యువతకు నచ్చే విధంగా కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి తెరకెక్కిస్తున్నారు.

ఇటీవల కాలంలో మహేష్ బాబు నటించిన ‘ఆగడు' చిత్రం బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాలు ఇవ్వక పోవడంతో ఫ్యామిలీ ఎంటర్టెనర్ మీద దృష్టి సారించాడు మహేష్ బాబు.

English summary
Director Srikanth Addala confirms that, Principle shooting of 'Brahmotsavam' begins on May 30th. It is slated to release for Sankranthi 2016. "'Brahmotsavam' is a family entertainer which suits Mahesh Babu's image. Rakul Preet Singh plays the female lead. Dil Raju will produce it. Prakash Raj and Rao Ramesh will appear in pivotal roles," he says.
Please Wait while comments are loading...