»   » నా కూతురుని ఒప్పించే పెళ్లి చేసుకుంటున్నా, సీక్రెసీ అందుకే, ఏజ్ గ్యాప్ బాగా ఎక్కువే

నా కూతురుని ఒప్పించే పెళ్లి చేసుకుంటున్నా, సీక్రెసీ అందుకే, ఏజ్ గ్యాప్ బాగా ఎక్కువే

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొచ్చి‌: సినిమా వాళ్ళ పెళ్లిళ్లు సినిమాటెక్ గా జరుగుతాయా..లేక వారు అలా కావాలనే ప్లాన్ చేస్తారో...ఇప్పుడు మళయాళ చిత్ర పరిశ్రమలో లాస్ట్ మినిట్ వరకూ సీక్రెసీ మెయింటైన్ చేసి, హోటల్ లో పెళ్లి చేసుకుని ఒక్కటైన హీరో,హీరోయిన్ విషయం చర్చనీయాంశంగా మారింది. అందుకు కారణం వీళ్లిద్దరి మధ్యా ఉన్న ఏజ్ గ్యాప్.

మళయాళి చిత్ర పరిశ్రమలో స్టార్‌ హీరో,హీరోయిన్స్ గా వెలుగుతున్న దిలీప్‌, కావ్య మాధవన్‌ ఇన్నాళ్ల ప్రేమ తర్వాత ఒక ఇంటివాళ్లు అయ్యారు. వీరిద్దరు ప్రేమలో ఉన్నారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఇద్దరూ వాటిని ఖండిస్తూ వస్తున్నారు. కానీ మీడియా మాత్రం ఖచ్చితంగా వీరిద్దరూ మధ్యా ఏదో నడుస్తోంది అంటోంది.

అయితే వీటికి సమాధానంగా వీరిద్దరు శుక్రవారం కొచ్చిలోని ఓ హోటల్‌లో సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, మాలీవుడ్‌ సినీ ప్రముఖులు హాజరయ్యారు.

చివరి వరకూ ఎవరికీ తెలియకుండా

చివరి వరకూ ఎవరికీ తెలియకుండా

పెళ్లికి కొద్ది గంటల ముందువరకూ కూడా ఎవరికీ తెలియనివ్వకుండా దిలీప్, కావ్య జాగ్రత్త పడ్డారు. ఒక్కసారే ఇద్దరూ పెళ్లి దుస్తుల్లో మీడియా ముందు కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. దాంతో అక్కడ ఇదో సెన్సేషన్ న్యూస్ అయ్యింది.

కుటుంబం సమ్మతితోనే..

కుటుంబం సమ్మతితోనే..

వివాహం అనంతరం దిలీప్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘నా కుటుంబంలో నెలకొన్న సమస్యలకు కావ్య కారణం కాదు. గత కొద్దిరోజులుగా ఈ పెళ్లి గురించి నేను ఇంట్లో వారితో, నా కుమార్తెతో చర్చించాను. ఇవాళ వారి సమ్మతితో కావ్యని పెళ్లి చేసుకున్నా' అన్నారు.

మాజీ భార్యతోనూ మాట్లాడారు

మాజీ భార్యతోనూ మాట్లాడారు

దిలీప్‌ వివాహానికి కొన్ని నిమిషాల ముందు ఫేస్‌బుక్‌ ద్వారా కావ్యను తన భార్యగా స్వీకరించనున్నట్లు వెల్లడించారు. ఈ పెళ్లి గురించి తన మాజీ భార్యతో మాట్లాడినట్లు చెప్పారు. ఆమె సమ్మతించినట్లు వివరించారు.

ప్లీజ్ అంటూ మీడియాని

ప్లీజ్ అంటూ మీడియాని

అలాగే దయచేసి ఈ విషయాన్ని వివాదాస్పదం చేయొద్దని, అందరి ఆశీస్సులు తమకు కావాలని కోరారు. మీడియా ఈ విషయమై చిలవలు పలవలు రాయద్దు ,ప్రసారం చేయవద్దని కోరారు. ఆయన తరపు మేనేజర్ కూడా మీడియాని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసారు.

ఇద్దరికీ రెండో పెళ్లే..

ఇద్దరికీ రెండో పెళ్లే..

దిలీప్ కు .. 1998లో దిలీప్‌కు మంజు అనే నటితో వివాహమైంది. వీరిద్దరు 2014లో విడిపోయారు. వీరికి ఓ కుమార్తె. కాగా కావ్య గతంలో నిషాల్‌ చంద్ర అనే నటుడ్ని పెళ్లి చేసుకున్నారు. కానీ కొద్దిరోజులకే అతడి నుంచీ విడిపోయారు. దిలీప్‌, కావ్య కలిసి 23 చిత్రాల్లో నటించారు.

కూతురు ఫర్మిషన్ కోసం

కూతురు ఫర్మిషన్ కోసం

ఇంతకు ముందే ఈ జంట కేరళలోని గురువాయర్ లో వివాహం చేసుకుంటారని వార్తలు వచ్చాయి. అయితే దిలీప్ తన కుమార్తె మీనాక్షి ని ఈ వివాహ విషయమై ఒప్పించే విషయం ఇంతకాలం వెయిట్ చేసారట. లేకపోతే ఆరు నెలల క్రితమే ఈ జంట ఒకటయ్యేది.

మీడియాకు నో లీక్

మీడియాకు నో లీక్

ఇక మ్యారేజ్ విషయమై లీక్ మీడియాకు వెళ్లినా వారు నమ్మలేదట. ఎందుకంటే..గతంలో నాలుగైదు సార్లు ఇలాగే వీరిద్దరూ వివాహం విషయమై ఫలానా చోట పెళ్లి చేసుకోబోతున్నారని అని వస్తే ..అక్కడికి వెల్లి వెయిట్ చేయటం ..జరిగకపోవటం జరిగిందిట.

ప్లాన్ చేసారు..

ప్లాన్ చేసారు..

చివరి నిముషాల్లో ఓ ప్లానింగ్ ప్రకారం ..దిలీప్ మేనేజర్ నుంచి మీడియాఛానెల్స్ కు ఫోన్స్ వెళ్లాయి. దాంతో మీడియా వారు హడావిడిగా పరుగెత్తుకు వచ్చారు. ఎర్నాకులంలోని వేదాంత హోటల్ లో ఈ వివాహం చోటు చేసుకుంది.

ఎలా రాగలుగుతారు..

ఎలా రాగలుగుతారు..

ఈ వివాహానికి మళయాళ పరిశ్రమనుంచి ముమ్మట్టి, జయరామ్, జోమోల్ హాజరయ్యారు. లాస్ట్ మినిట్ లో సెలబ్రెటీలకుసైతం తెలియటంతో చాలా మంది ఈ వివాహానికి హాజరు కాలేదు. సెలబ్రెటీలకు తెలిసినా అది బయిటకు వెళ్లిపోతుందనే భయంతో ఎవరికీ చెప్పలేదట.

మొదటి భార్యతో

మొదటి భార్యతో

ఇక ఈ వివాహం గురించి ఎవరూ పెద్దగా ఎక్సపెక్ట్ చేయలేదు. దిలీప్ తన మొదటి భార్య మంజుతో తిరిగి కలుస్తాడని భావించారు. దాంతో మంజు తరుపు వాళ్లు చాలా డిజప్పాయింట్ కు గురి అయ్యారు. మంజు వారియర్ మాత్రం దిలీప్ శుభాకాంక్షలు తెలియచేసిందని చెప్తున్నారు.

అలా అంటోంది

అలా అంటోంది

అక్కడ మళయాళి మీడియా ఈ విషయాన్ని మొదటే గెస్ చేసినట్లు చెప్తోంది. దిలీప్ తన భార్యకు, కార్య తన భర్తకు విడాకులు ఇచ్చినప్పుడే వీళ్లిద్దరూ ఒకటి అవుతామని భావించామని, ఇప్పుడు అదే నిజమైందని కథనాలు ప్రసారం చేస్తోంది. అయితే ఇది సున్నితమైన విషయం కావటంతో ఎవరూ కామెంట్ చేయటానికి సాహసించటం లేదు.

అంత వయస్సు తేడా

అంత వయస్సు తేడా

ఇక ఈ వివాహం విషయంలో మరో టాపిక్ మొదలైంది. దిలీప్, కావ్య మాధవన్ ఏజ్ గ్యాప్ గురించి. దిలీప్ కు వయస్సు 48 సంవత్సరాలు. కావ్య మాధవన్ కు 32 సంవత్సరాలు. ఇద్దరి మధ్యా 16 సంవత్సరాలు ఏజ్ గ్యాప్ ఉంది. గతంలో దిలీప్ వివాహం చేసుకున్న మంజు వారియర్ కు, దిలీప్ మధ్య పదేళ్లు వయస్సు తేడా ఉంది.

English summary
Age of Dileep at present on his second marriage is 48 years and Kavya Madhavan is 32 years. Age difference between Dileep – Kavya Madhavan is 16 years. Manju Warrier is aged 38 years and age difference between her and Dileep is 10 years.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu