»   »  ట్రెండింగ్ ఇదే వీడియో ‌: హీరో,హీరోయిన్స్ కదా ఆ మాత్రం క్రేజ్,హానీమూన్ కు

ట్రెండింగ్ ఇదే వీడియో ‌: హీరో,హీరోయిన్స్ కదా ఆ మాత్రం క్రేజ్,హానీమూన్ కు

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొచ్చి‌: మళయాళ చిత్ర సీమలో స్టార్‌ హీరో,హీరోయిన్స్ గా రాణిస్తున్న దిలీప్‌, కావ్య మాధవన్‌ ఇన్నాళ్ల ప్రేమ తర్వాత ఒక ఇంటివాళ్లు అయ్యారు. దుబాయికి హాని మూన్ కు వెల్లిపోయారు.

వీరిద్దరు ప్రేమలో ఉన్నారని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే వీరు ఎప్పుడూ ఆ విషయం ధృవీకరించలేదు. అయితే ఆ రూమర్స్, గాసిప్స్, ప్రశ్నలన్నిటికీ సమాధానంగా వీరిద్దరు శుక్రవారం కొచ్చిలోని ఓ హోటల్‌లో సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, మాలీవుడ్‌ సినీ ప్రముఖులు హాజరయ్యారు.

పెళ్లికి కొద్ది గంటల ముందువరకూ కూడా ఎవరికీ తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డారు. ఒక్కసారే ఇద్దరూ పెళ్లి దుస్తుల్లో మీడియా ముందు కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ వీడియో మీరు ఇక్కడ చూడవచ్చు.

తెగ నచ్చేసి

మళయాళిలు మాత్రమే కాదు అందరూ ఈ ట్రైలర్ ని తెగ చూస్తున్నారు. ఈ ట్రైలర్ దిలీప్, కావ్య అభిమానులకు తెగ నచ్చేసింది. ఎంతలా అంటే యూ ట్యూబ్ లో ఇది ట్రెండింగ్ లో ఉంది.

ఇంట్లో వారితో చర్చించే...

ఇంట్లో వారితో చర్చించే...

వివాహం అనంతరం దిలీప్‌ మీడియాతో మాట్లాడుతూ..'నా కుటుంబంలో నెలకొన్న సమస్యలకు కావ్య కారణం కాదు. గత కొద్దిరోజులుగా ఈ పెళ్లి గురించి నేను ఇంట్లో వారితో, నా కుమార్తెతో చర్చించాను. ఇవాళ వారి సమ్మతితో కావ్యని పెళ్లి చేసుకున్నా' అన్నారు.

ఫేస్ బుక్ లో ముందే

ఫేస్ బుక్ లో ముందే

దిలీప్‌ వివాహానికి కొన్ని నిమిషాల ముందు ఫేస్‌బుక్‌ ద్వారా కావ్యను తన భార్యగా స్వీకరించనున్నట్లు వెల్లడించారు. ఈ పెళ్లి గురించి తన మాజీ భార్యతో మాట్లాడినట్లు చెప్పారు. దయచేసి ఈ విషయాన్ని వివాదాస్పదం చేయొద్దని, అందరి ఆశీస్సులు తమకు కావాలని కోరారు.

ఇద్దరూ విడిపోయే...

ఇద్దరూ విడిపోయే...

1998లో దిలీప్‌కు మంజు వారియర్ అనే నటితో వివాహమైంది. వీరిద్దరు 2014లో విడిపోయారు. వీరికి ఓ కుమార్తె. కాగా కావ్య గతంలో నిషాల్‌ చంద్ర అనే నటుడ్ని పెళ్లి చేసుకున్నారు. కానీ కొద్దిరోజులకే అతడి నుంచీ విడిపోయారు. దిలీప్‌, కావ్య కలిసి 23 చిత్రాల్లో నటించారు.

మీడియాకు భయపడే

మీడియాకు భయపడే

పెళ్లికి కొద్ది గంటల ముందువరకూ కూడా ఎవరికీ తెలియనివ్వకుండా దిలీప్, కావ్య జాగ్రత్త పడ్డారు. అందుకుకారణం మీడియాలో ఏ వార్తలు ప్రచారం అవుతాయనే అంటున్నారు. ఒక్కసారే ఇద్దరూ పెళ్లి దుస్తుల్లో మీడియా ముందు కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. దాంతో అక్కడ ఇదో సెన్సేషన్ న్యూస్ అయ్యింది.

అప్పుడే ప్రేమలో పడి

అప్పుడే ప్రేమలో పడి

కావ్య, దిలీప్ ఇధ్దరూ కలిసి 23 సినిమల్లో చేసారు. రెండో సినిమా సమయంలోనే వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారని చెప్తారు. అదే దిలీప్ కాపురాన్ని దెబ్బ తీసిందని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే దిలీప్ ఈవిషయాలు ఖండిస్తూ వస్తున్నారు.

బలి పశువను చెయ్యద్దు

బలి పశువను చెయ్యద్దు

మీకందరికీ నా కుటుంబంలోని సమస్యలు తెలుసు. అయితే వాటికి కావ్యని ముడిపెట్టి బలి పశువును చేయద్దు అని చాలా సార్లు చెప్పాను, మరోసారి చెప్తున్నా, అసలు ఆమెకూ నా కుటుంబంలో గతంలో వచ్చిన గొడవలకు అసలు సంభంధం లేదని తేల్చారు మళ్ళీ దిలీప్.

అదే మొదట భార్యతో వివాదానికి

అదే మొదట భార్యతో వివాదానికి

దిలీప్ కు మొదటి భార్య మంజు కు మధ్య వివాదానికి కారణం అంటూ వనిత (పాపులర్ మళయాళి మ్యాగజైన్) లో ఇచ్చిన ఇంటర్వూలో ..దిలీప్ కు తన భార్య ఇంటిపట్టునే ఉండాలని ఉండేదని, నటిగా బయిటకు వెళ్లటం ఇష్టం లేదని, తను తెచ్చే సంపాదన సరిపోతుందని, తమ కుమార్తెను చూసుకుంటూ ఉండమని కోరినట్లు చెప్పారామె.

కల్ట్ సినిమాలు చేసిన ఆమె

కల్ట్ సినిమాలు చేసిన ఆమె

దిలీప్, మంజు వారియర్ ని 1998 వివాహం చేసుకున్నారు. అప్పుడే ఆమె కెరీర్ పీక్ లో ఉంది. మళయాళ కల్ట్ సినిమాలైన Aaramthamburan (1997), Kanmadam (1998) వంటి సినిమాల్లో ఆమె అద్బుతమైన ఫెరఫార్మన్స్ ఇచ్చింది. అయితే పెళ్ళయ్యాక ఆమె సినిమాలు చెయ్యలేదు. దాంతో మళయాళ పరిశ్రమ లో చాలా మంది ఆమెను ఇదే విషయం ప్రశ్నించారు.

హౌ ఓల్డ్ ఆర్యూ...

హౌ ఓల్డ్ ఆర్యూ...

అయితే మంజు ..తన భర్త దిలీప్ తో విడిపోయాక ..మళ్ళీ 2015 లో హౌ ఓల్డ్ ఆర్యూ అంటూ రీ ఎంట్రీ ఇచ్చి పెద్ద హిట్ కొట్టింది. అది ఆమె పర్శనల్ లైఫ్ పోలికలతో ఉన్న చిత్రం అని టాక్ వచ్చింది. రకరకాల చర్చలు ఆ సినిమాపై జరిగాయి. అదే సినిమా సక్సెస్ కు భారి ఎత్తున ఉపకరించింది. ఇండస్ట్రీ మొత్తం ఆమెకు సపోర్ట్ గా నిలిచింది.

ఏది ఎలా ఉన్నా

ఏది ఎలా ఉన్నా

మంజు విషయం ఎలా ఉన్నా ముందు కావ్యా మాధవన్ కు రిలీఫ్ వచ్చినట్లే. ఎందుకంటే ఆమె ఓ దశలో మీడియాను ఫేస్ చేయాలంటే భయపడే స్టేజికి వచ్చేసింది. దిలీప్ ని కానీ,ఆమెను కానీ సందర్బం కూడా చూసుకోకుండా మీ మధ్య రిలేషన్ ఉందంటున్నారు. మీరేమంటారు అనే ప్రశ్నే అడిగేవారు. అది వీళ్లిద్దరికీ పెద్ద సమస్యగా మారింది. ఈ పెళ్లితో ఆ సమస్య చాలా భాగం తీరినట్లే అని చెప్పాలి.

డైవర్స్ కు అప్లై చేసిన నాటి నుంచి...

డైవర్స్ కు అప్లై చేసిన నాటి నుంచి...

అంతెందుకు మీరు గూగుల్ సెర్చ్ లో కావ్య మాధవన్, దిలీప్ పేర్లు కొడితే వీళ్దిద్దరి మధ్య రిలేషన్ అంటూ రక రకాల కథనాలు ప్రత్యక్ష్యమవుతాయి. అంతలా అవి పాపులర్ అయ్యాయి. మరో ప్రక్క మీడియా, ముఖ్యంగా 2014లో దిలీప్ మొదటి భార్య మంజు డైవర్స్ కు అప్లై చేసిన వద్ద నుంచీ మరీ ఈ వార్తలు ఎక్కవయ్యాయి.

ఇదిగో ఇలా...

తమ వివాహ విషయమై దిలీప్ మాట్లాడి తన ఫేస్ బుక్ లో పెట్టి తన అభిమానులకు అంద చేసారు. ఆ వీడియో మీరు ఇక్కడ చూడవచ్చు.

దుబాయిలోనే

దుబాయిలోనే

ఇక దుబాయికి ఈ కొత్త జంట వెల్లారు. అక్కడ దిలీప్ సన్నిహితుడైన నటుడు ముమ్మట్టి ఈ జంటకు ఓ గిప్ట్ ఇవ్వనున్నారట. అది ఓ భారీ పార్టీ అని తెలుస్తోంది. ఈ పార్టీ దుబాయిలో స్పెషల్ గా ముమ్మట్టి ప్లాన్ చేసి తన మిత్రుడుని ఆనందపరుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

వయస్సు వ్యత్యాసం

వయస్సు వ్యత్యాసం

లాస్ట్ మినిట్ వరకూ సీక్రెసీ మెయింటైన్ చేసి, హోటల్ లో పెళ్లి చేసుకుని ఒక్కటైన హీరో,హీరోయిన్ విషయం చర్చనీయాంశంగా మారింది. అందుకు కారణం వీళ్లిద్దరి మధ్యా ఉన్న ఏజ్ గ్యాప్.

నా కూతురుని ఒప్పించే పెళ్లి చేసుకుంటున్నా, సీక్రెసీ అందుకే, ఏజ్ గ్యాప్ బాగా ఎక్కువే

English summary
Dileep and Kavya Madhavan get married in a private ceremony, watch video and pics. Dileep, Kavya Madhavan got married in a secret ceremony in Kochi on Friday morning. The wedding was kept a secret till hours before the ceremony.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu