»   »  లైంగిక దాడి కేసులో హీరో దిలీప్ అరెస్ట్: షాకయ్యానన్న బాధిత హీరోయిన్!

లైంగిక దాడి కేసులో హీరో దిలీప్ అరెస్ట్: షాకయ్యానన్న బాధిత హీరోయిన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ కేరళ హీరోయిన్ కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో మలయాళ అగ్రహీరో దిలీప్ అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బాధిత హీరోయన్ ఎట్టకేలకు స్పందించారు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తనపై జరిగిన లైంగిక దాడి కేసుకు సంబంధించి ఇచ్చిన ఫిర్యాదులో..... తాను ఎవరి పేరునూ పేర్కొనలేదని, ఎవరిపై కూడా అనుమానం వ్యక్తం చేయలేదని, హీరో దిలీప్‌ అరెస్టు విషయం తెలిసిన తర్వాత అందరిలాగానే తానూ షాక్‌ అయ్యానని ఆమె తెలిపారు.

అతడి పేరు ప్రస్తావించకుండా...

అతడి పేరు ప్రస్తావించకుండా...

దిలీప్ పేరు ప్రస్తావించకుండానే... ఆ హీరోతో తాను చాలా సినిమాల్లో పనిచేశానని, నాపై జరిగిన లైంగిక వేధింపులు, కిడ్నాప్ కేసులో అతడి హస్తం ఉంటుందని, పోలీసులు అరెస్టు చేస్తారని తాను కూడా ఊహించలేదని ఆమె అన్నారు.

Dileep Arrested In Actress Abduction Case | Filmibeat Telugu
రియల్ ఎస్టేట్ తగాదాలు అవాస్తవం

రియల్ ఎస్టేట్ తగాదాలు అవాస్తవం

అతడితో తనకు రియల్‌ ఎస్టేట్‌, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన తగాదాలు ఉండటం వల్లనే తమ మధ్య శతృత్వం నెలకొందనే వార్తలను ఆమె ఖండించారు. కొన్ని పర్సనల్ విషయాల వల్లనే అతడితో గొడవలు వచ్చాయని తెలిపారు.

తప్పు చేయకుంటే నిర్దోషిగా బయటికొస్తాడు

తప్పు చేయకుంటే నిర్దోషిగా బయటికొస్తాడు

దిలీప్‌ తప్పు చేశాడా? లేదా? అనేది నాకు తెలియదు. అతడు చెబుతున్నట్లు ఈ నేరం చేసి ఉండకపోతే నిజం తప్పక బయటికొస్తుందని, నిర్దోషిగా బయటకు వస్తాడు అని సదరు నటి తన స్టేట్మెంట్లో పేర్కొనడం విశేషం.

దోషులకు శిక్ష పడాలి

దోషులకు శిక్ష పడాలి

పోలీసులు ఈ కేసులో వీలైనంత త్వరగా వాస్తవాలు బయటకు తెస్తారని ఆశిస్తున్నాను. తప్పు చేసింది ఎవరైనా శిక్ష పడాలి. అదే సమయంలో అమాయకులకు శిక్ష పడకూడదు... అని హీరోయిన్ ఆకాక్షించారు.

జుడీషియల్ కస్టడీలో దిలీప్

జుడీషియల్ కస్టడీలో దిలీప్

హీరోయిన్‌పై లైంగిక దాడి, కిడ్నాప్ కేసుసులో సోమవారం అరెస్టయిన దిలీప్‌కు 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించారు. పోలీసులు అతడిని వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. పల్సర్ సుని అండ్ గ్యాంగ్‌ను ఉసిగొల్పి అతడే ఈ దాడి చేయించినట్లు పోలీసుల వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయి.

నన్ను కావాలనే ఇరికించారు

నన్ను కావాలనే ఇరికించారు

అయితే తాను ఏ తప్పూ చేయలేదని, తనను ప్లాన్ ప్రకారం ఈ కేసులో ఇరికించారని దిలీప్ ఆరోపిస్తున్నారు. తన నిజాయితీని నిరూపించుకుంటానని, త్వరలోనే తాను నిర్దోషిగా బయటకు వస్తానని తెలిపారు.

English summary
The arrest of actor Dileep, in connection with the actress attack case, is the latest hot topic of the state. Now, the attacked actress has finally broken her silence over Dileep's arrest and released an official statement. The actress, who revealed that she is still not in a mental state to address the media, stated that the incidents which happened in the past few days were extremely shocking. She asserts that she has never falsely accused Dileep for the crime.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu