»   » పవన్, మహేష్ సినిమాల పరిస్థితి ఏంటి..?

పవన్, మహేష్ సినిమాల పరిస్థితి ఏంటి..?

Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ ప్రముఖ హీరోలు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లు నటిస్తున్న సినిమాలు ఏమయ్యాయో ఎవ్వరికీ తెలియని పరిస్థితి. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న ఖలేజా, ఎస్ జె సూర్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న పులి సినిమా షూటింగులు గత రెండు సంవత్సరాలుగా జరుగుతూనే వున్నాయి. ఈ రెండు సినిమాలకూ నిర్మాత శింగనమల రమేషే కావడం గమనార్హం. మరీ చిత్రాల పరిస్థితి ఏంటి అంటే మాత్రం ప్రశ్నార్థకమే.

ఈ రెండు సినిమాలకూ ఇప్పటికే ఓవర్ బడ్జెట్ అయిందట..నిర్మత సైతం నేనేమీ చెయ్యలేనని చేతులు ఎత్తేసాడట. మరి ఈ ఆలస్యానికి కారణం ఎవరు కథానాయకులా..?? అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు. సినిమా సూపర్ హిట్ అయినా నిర్మాతకు ఖర్చు చేసింది, వడ్డీ అన్నీ కలిపితే పూర్తి డబ్బుకూడా రాని పరిస్థితి. మరీ సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయో..?? మీకేమయినా తెలుసా..!?

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu