»   »  ఆసుపత్రిలో చేరిన దిలీప్ కుమార్

ఆసుపత్రిలో చేరిన దిలీప్ కుమార్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Dilip Kumar
ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ (86) నిన్నరాత్రి లేట్ అవర్స్ లో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. గత కొంతకాలంగా యూరినరీ ఇన్ఫెక్షన్ తో ఆయన బాధ పడుతున్నారు. న్యూ ఢిల్లీ లోనీ ఇంద్రప్రస్ధ అపోలో హాస్పటల్ లో ని ఐసియు లో ఆయన ప్రస్తుతం ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఆయన ప్రస్తుత పరిస్ధితి క్రిటికల్ గా ఉన్నా త్వరలోనే కోలుకుంటారని, ఐసియు నుంచి జనరల్ వార్డుకి షిప్ట్ చేస్తామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

రీసెంట్ గా ఆయన రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా 54 వ జాతీయ సినిమా పురస్కార వేడుకలలో లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డును అందుకున్నారు. ఇక ఆయన కెరీర్ లో దేవదాస్(1955),మొఘల్-ఇ-అజామ్(1960),గంగ జమున(1961),కర్మ(1986) వంటి అధ్బుతమైన చిత్రాలలో అపూర్వమైన నటనను ప్రదర్శించారు. అభిమానులే కాక బాలీవుడ్ మొత్తం ఆయన సీరియస్ స్ధితిలో ఆసుపత్రిలో జాయిన్ అవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X