»   » పద్మవిభూషణ్‌ అందుకున్న దిలీప్‌కుమార్‌

పద్మవిభూషణ్‌ అందుకున్న దిలీప్‌కుమార్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై‌: అలనాటి బాలీవుడ్‌ హీరో దిలీప్‌ కుమార్‌ పద్మవిభూషణ్‌ పురస్కారం ఈ రోజు అందుకున్నారు. ముంబయిలోని ఆయన నివాసంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

దిలీప్‌ కుమార్‌ శుక్రవారం 93వ పడిలోకి అడుగుపెట్టారు. పద్మవిభూషణ్‌ అందుకున్న అత్యంత పెద్ద వయస్సు గల వారిలో ఆయన రెండో వ్యక్తి. భారత సినీ రంగంలోని గొప్ప నటుల్లో దిలీప్‌ కుమార్‌ ఒకరు. ఆయన సినీ రంగానికి చేసిన సేవకు గానూ.. ఈ అవార్డును అందించారు.

Dilip Kumar Receives Padma Vibhushan Honour

ఈ ఏడాది జనవరి 25న బాలీవుడ్‌ నటులు అమితాబ్‌ బచ్చన్‌, దిలీప్‌కుమార్‌లతో పాటు పలువురికి పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించారు. అయితే ఏప్రిల్‌లో రాష్ట్రపతి భవన్‌లో ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా జరిగిన పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి అనారోగ్య కారణాలతో దిలీప్‌కుమార్‌ హాజరుకాలేకపోయారు. దీంతో నేడు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ దిలీప్‌కుమార్‌ నివాసానికి వెళ్లి పురస్కారాన్ని ప్రదానం చేశారు.

English summary
Dilip Kumar receives the Padma Vibhushan award at his residence in Mumbai.
Please Wait while comments are loading...