»   » ఆమె బూతు సినిమా చరిత్రను..తెరకెక్కిస్తారట!

ఆమె బూతు సినిమా చరిత్రను..తెరకెక్కిస్తారట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇప్పుడంటే సన్నీలియోన్ బాలీవుడ్లో పెద్ద స్టార్. హాట్ అండ్ సెక్సీ హీరోయిన్. అంతకు ముందు ఆమె పెద్దలకు మాత్రమే పరిమితమైన సెక్స్(పోర్న్) చిత్రాల తార. అసలు ఏ పరిస్థితుల్లో తాను పోర్న్‌స్టార్‌గా మారింది.. బాలీవుడ్‌లో ఎలా అడుగుపెట్టింది అనే విషయాలతో ఓ సినిమాలో నటించడానికి ఓకే చెప్పిందట సన్నీ లియోన్. సన్నీ రియల్‌ లైఫ్‌లోని సంఘటనలను సినిమా స్టోరీగా మలిచేందుకు డాక్యుమెంటరీ దర్శకుడు దిలీప్ మెహతా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

సన్నీ లియోన్ పంజాబీ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. ఆమె అసలు పేరు కరన్జీత్ కౌర్ వోహ్రా. కెనడాలో సెటిలైన పంజాబీ ఫ్యామిలీలో సన్నీ లియోన్ జన్మించింది. అడల్ట్ ఫిల్మ్ స్టార్ అవుతానని సన్నీ లియోన్ అసలు అనుకోలేదు. ఈ రంగంలోకి రాక ముందు ఆమె పెడియాట్రిక్ నర్స్ కోర్సు చదివింది. తన 19వ ఏట ఆమె అడల్ట్ చిత్రరంగంలోకి ప్రవేశించింది. 11వ ఏటనే సన్నీ లియోన్ ఫస్ట్ కిస్ రుచి చూసిందట. తన 16వ ఏట స్కూలు రోజుల్లోనే ఓ బాస్కెట్ బాల్ ప్లేయర్‌తో శృంగారంలో పాల్గొని తన కన్యత్వాన్ని కోల్పోయింది.

అడల్ట్ చిత్రాల్లోకి రాక ముందు సన్నీ లియోన్ జర్మన్ బేకరీలో కూడా పని చేసింది. సన్నీ లియోన్ మొదట్లో లెస్బియన్ అడల్ట్ చిత్రాల్లో మాత్రమే నటించేది. ఆమె పురుషుడితో కలిసి చేసిన తొలి అడల్ట్ చిత్రం మాట్ ఎరిక్సన్ అనే వ్యక్తితో. ఇద్దరూ కలిసి కొంతకాలం డేటింగ్ చేయడంతో పాటు పలు అడల్ట్ చిత్రాల్లో నటించారు. ఇద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అయితే వీరి వ్యవహారం పెళ్లి వరకు వెళ్లలేదు. 2008లో విడిపోయారు. అతనితో విడిపోయిన తర్వాత సొంత నిర్మాణ సంస్థను స్థాపించింది. 2011లో సన్నీ లియోన్ డేనియల్ వెబర్‌ను పెళ్లాడింది.

Dilip Mehta to make documentary on Sunny Leone

2011లో బిగ్ బాస్ షో ద్వారా ఇండియాకి పరిచయమైన ఆమో మహేష్ భట్ క్యాంపును ఆకర్షించింది. జిస్మ్-2 చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. సన్నీ లియోన్ ప్రస్తుతం బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి అందాల ఆరబోతతో దుమ్ము రేపుతోంది. కెనడాలో పెరిగి, అమెరికాలో ఫోర్న్ స్టార్‌గా ఎదిగిన అమ్మడు భారత సంతతికి చెందిన వ్యక్తి కావడంతో బాలీవుడ్లో మంచి ఆమెకు ఆదరణ లభిస్తోంది. 2011లో బిగ్ బాస్ 5 అనే రియాల్టీ షో ద్వారా ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలో అడుగు పెట్టిన సన్నీ లియోన్...అప్పట్లో హాట్ టాపిక్. ఆమె పోర్న్ స్టార్ కావడంతో అప్పట్లో ఆమె గురించి మీడియా చర్చ సాగింది. ఆ పరిణామాలు ఆమెకు మరింత పాపులారిటీ తెచ్చి పెట్టాయి.

అప్పటి వరకు సన్నీ లియోన్ అంటే ఎవరో తెలియని వారు...ఆమె సెక్స్ చిత్రాల తార అనే విషయం విషయం తెలియడంతో అంతా ఆశ్చర్య పోయారు. ఇంటర్నెట్లో ఆమె గతంలో నటించిన శృంగార చిత్రాలు చూసి భారీగా అభిమానులు ఏర్పడ్డారు. జిస్మ్-2, రాగిణి ఎంఎంఎస్ 2 లాంటి చిత్రాలతో ఆమెకు ఫాలోయింగ్ మరింత పెరిగింది.

ప్రస్తుతం శృంగార చిత్రాలు చేయడం మానేసి పూర్తిగా బాలీవుడ్ చిత్రాలపైనే దృష్టి సారించింది సన్నీ లియోన్. సన్నీ లియోన్ గత జీవితంలో ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఆమె 42 శృంగార చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు, 41 సెక్స్ చిత్రాల్లో నటించింది. ఇలా ఆమె జీవితానికి సంబంధించిన విషయాలన్నీ సినిమాగా తీసే ఆలోచన చేస్తున్నారు.

English summary
Photojournalist Dilip Mehta wants to make a documentary on adult movie star Sunny Leone.
Please Wait while comments are loading...