»   » బాగా సౌండే....సొంత విమానం కొన్న ఇండియన్ హీరో (ఫోటోస్)

బాగా సౌండే....సొంత విమానం కొన్న ఇండియన్ హీరో (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సొంతగా ప్రైవేట్ జెట్ కొనడం అంటే మామూలు విషయం కాదు. కోట్లతో కూడుకున్న వ్యవహారం. వందల కోట్ల ఆస్తులు ఉన్నవారికే ఇది సాధ్యం. తాజాగా ఓ ఇండియన హీరో సొంతగా ప్రైవేట్ జెట్ కొనుక్కుని వార్తల్లోకి ఎక్కాడు. ఆ నటుడి పేరు దిల్జిత్ దోసాంజె. పంజాబీ సింగర్, యాక్టర్ అయిన దిల్జీత్ అక్కడ బాగా పాపులర్. ఉడ్తా పంజాబ్ సినిమా ద్వారా ఇటీవలే బాలీవుడ్ కి పరిచయం అయ్యాడు.

సొంతగా ప్రైవేట్ జెట్ కొన్న విషయాన్ని దిల్జీత్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను పోస్టు చేసారు. పంజాబీ పాప్ సింగర్ గా బాగా పాపులర్ అయిన దిల్జీత్ త్వరలో మ్యూజికల్ కాన్సెర్ట్ పేరుతో వరల్డ్ టూర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ టూర్ కోసమే సొంతగా ప్రైవేట్ జెట్ కొనుగోలు చేసాడట.

పాపులర్ స్టార్

పాపులర్ స్టార్

పంజాబ్ లో దిల్జీత్ పాపులర్ స్టార్. సింగర్‌గా, నటుడిగా అక్కడ బాగా ఫేమస్. పాపులారిటీ కూడా దిల్జీత్ సంపాదన కూడా ఎక్కువే.

అనేక అవార్డులు

అనేక అవార్డులు

నటుడిగా, సింగర్ గా దిల్జీత్ అనేక అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నాడు. పంజాబీ యూత్ బాగా ఆరాధించే సింగర్, యాక్టర్లలో దిల్జీత్ ఒకరు.

మ్యూజిక్ కాన్సెర్టులు

మ్యూజిక్ కాన్సెర్టులు

అమెరికాలో పాటు పంజాబీలు ఎక్కువగా ఉండే వివిధ దేశాల్లో మ్యూజిక్ కాన్సెర్టులు నిర్వహించేందుకు దిల్జీత్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ వరల్డ్ టూర్ కోసమే దిల్జీత్ ప్రత్యేకంగా ప్రైవేట్ జెట్ కొనుగోలు చేసారు.

మ్యూజిక్ కెరీర్

పంజాబీ, భాంగ్రా, రొమాంటిక్, పాప్, సిక్ ఇలా అన్ని రకాల ఆల్బమ్స్ తో యువతను ఉర్రూతలూగించడంతో దిల్జీత్ బాగా పాపులర్ అయ్యాడు. పంజాబ్ లో అత్యధికంగా సంపాదించే స్టార్లలో దిల్జీత్ ఒకరు.

English summary
Diljit Dosanjh is one new actor who was introduced to Bollywood cinema with the film Udta Punjab. The latest information is that the actor has purchased a private jet. The same has been revealed by the actor himself via twitter.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu