»   » సిద్దార్ద హీరోగా 'దిల్ రాజు' టైటిల్ తో చిత్రం ఫస్ట్ లుక్ ఇదిగో

సిద్దార్ద హీరోగా 'దిల్ రాజు' టైటిల్ తో చిత్రం ఫస్ట్ లుక్ ఇదిగో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సిద్దార్ద హీరోగా తమిళంలో రూపొందిన జిగరతాండ చిత్రాన్ని తెలుగులో దిల్ రాజు టైటిల్ తో డబ్బింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దమ్ముంటే కాస్కో సబ్ టైటిల్ తో వస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని ఈ రోజు వదిలారు. దిల్ రాజు అనే టైటిల్ పెట్టడంతో ఒక్కసారిగా అందరి దృష్టీ ఈ చిత్రంపై పడింది. ఈ చిత్రం ఓపినింగ్స్ కు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

సిద్దార్ద హీరోగా పిజ్జా దర్శకుడు రూపొందించి తమిళంలో హిట్టైన 'జిగర్‌దండా' చిత్రానికి తెలుగు టైటిల్ గా 'చిక్కడు దొరకడు' ని ఖరారు చేస్తూ ఆ మధ్యన పోస్టర్ విడుదల చేసారు. అయితే ఆ తర్వాత ఆ సినిమా గురించి మాట్లాడేవారే కరువు అయ్యారు. దాంతో చిత్రం బిజినెస్ జరగకపోవటంతో మూలన పెట్టేసారని చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు దాన్ని మళ్లీ దుమ్ముదులిపి, టైటిల్ మార్చి... దిల్ రాజు అని పెట్టారు. అలాగే...దమ్ముంటే కాస్కో అనే ట్యాగ్ లైన్ తో విడుదల చేస్తున్నారు. అంటే దిల్ రాజు..దమ్ముంటే కాస్కో అని వస్తున్న చిత్రం విడుదల తేదీ త్వరలో ప్రకటించే అవకాసం ఉంది.

DilRaju dubbed version of 'Jigarthanda' First Look.

'బాయ్స్‌' ద్వారా తెలుగు,తమిళ ప్రేక్షకులను పలకరించిన నటుడు సిద్ధార్థ్‌. ఆ తర్వాత బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే నువ్వు వద్దంటానా వంటి చిత్రాలతో ... తెలుగువారికి నచ్చిన హీరోగా పేరు సొంతం చేసుకున్నాడు. కానీ కొంత కాలంగా తెలుగులో పెద్దగా ఆఫర్స లేవు. ఇప్పుడు తన దృష్టిని తమిళతెరపై పెట్టాడు. 'పిజ్జా' దర్శకుడు కార్తిక్‌ సుబ్బురాజ్‌ నిర్దేశకత్వంలో 'జిగర్‌దండా'లో నటించాడు.

ఇందులో దర్శకుడి పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. మరి మదురై యువకుడిగా ఎలా అయ్యాడని అనుకుంటున్నారా? సినిమా దర్శకత్వం కోసం మదురై వెళ్లే సిద్ధార్థ్‌ అక్కడ కొన్ని సమస్యల్ని ఎదుర్కొంటాడు. తన వృత్తిని పక్కనబెట్టి పక్కా మదురై యువకుడిగా మారి ఎలా పోరాడాడన్నదే కథాంశం. మాస్‌ ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని యూనిట్ చెబుతోంది.

ఈ చిత్రంలో సిద్ధార్థ్‌ సరసన హీరోయిన్ గా లక్ష్మీమీనన్‌ నటిచింది. తమిళంలో లక్ష్మీ మీనన్ కి మంచి క్రేజ్ ఉంది. దాంతో చిత్రానికి మంచి డిమాండ్ ఏర్పడింది. 'కాదలిల్‌ సొదప్పువదు ఎప్పడి'తో కోలీవుడ్‌లో స్థిరపడాలని సహ నిర్మాతగానూ మారాడని కోడంబాక్కం సమాచారం. ఆ తర్వాత తమిళ నేటివిటీకి దగ్గరగా సుందర్‌.సి దర్శకత్వంలో 'తీయా వేల సెయ్యనుం కుమారు'( తెలుగులో సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ )లో నటించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఆ హవాను కొనసాగించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు.

English summary
Siddardha's new movie ...DilRaju (Dammunte Kaasko) dubbed version of #Jigarthanda First Look.
Please Wait while comments are loading...