»   » షారుక్-కాజోల్... ‘దిల్‌వాలే’ ఫస్ట్ లుక్ అదిరింది (ఫోస్టర్)

షారుక్-కాజోల్... ‘దిల్‌వాలే’ ఫస్ట్ లుక్ అదిరింది (ఫోస్టర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకప్పుడు బాలీవుడ్లో షారుక్-కాజోల్ జోడీ అంటే చాలా ఫేమస్. బాలీవుడ్ ఐకానిక్ ఫిల్మ్స్ బాజిగర్, దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే, కుచ్ కుచ్ హోతా హై లాంటి ఆల్ టైం హిట్ చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. చాలా కాలం తర్వాత ఈ ఇద్దరూ ‘మై నేమ్ ఈజ్ ఖాన్' అనే చిత్రంలోనూ జోడీ కట్టారు.

తాజాగా మరోసారి కాజోల్ వెండితెరపై షారుక్ కు జోడీగా కనిపించబోతోంది. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న కాజోల్ బాలీవుడ్ తాజా మూవీ ‘దిల్ వాలే' చిత్రంలో నటిస్తోంది. రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆమె షారుక్ కు జోడీగా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేసారు. షారుక్ ఖాన్ ట్విట్టర్ ద్వారా ఈ ఫోటో షేర్ చేయడంతో పాటు డిసెంబర్ 18న సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు.

'Dilwale' first look poster

ఈ సినిమాలో నటిస్తున్నందుకుగాను కాజోల్ కు రూ. 5 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫాంలో ఉన్న బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ కత్రినా, కరీనా, ప్రియాంక చోప్రా లాంటి వాళ్లకు మాత్రమే ఈ రేంజిలో పారితోషికం ఉంది. అసలు ఫాంలో లేని, వయసు పైబడిన కాజోల్ కు ఈ రేంజిలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడం చర్చనీయాంశం అయింది.

కాజోల్ కు ఉన్న ఇమేజ్, టాలెంట్ తో పోలిస్తే ఇంత మొత్తంలో పారితోషికం ఇవ్వడంలో ఆశ్చర్యం ఏమీ లేదని పలువురు అంటున్నారు. మరో వైపు షారుక్-కాజోల్ జోడీ అంటే ప్రేక్షకుల్లో ఆసక్తి, సినిమాపై క్రేజ్ ఏర్పడుతుంది. అందుకే ఆమెకు ఇంత మొత్తంలో పారితోషికం ఆఫర్ చేసారని అంటున్నారు. ఈ చిత్రంలో షారుక్-కాజోల్‌తో పాటు వరుణ్ ధావన్ - కృతి సనన్ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రోహిత్ శెట్టి-గౌరీ ఖాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. క్రిస్ మస్ నాటికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తామని రోహిత్ శెట్టి చెబుతున్నారు.

English summary
Bollywood's on-screen power couple Shah Rukh Khan and Kajol have been spotted out and bout the streets of Bulgaria shooting for Rohit Shetty's 'Dilwale', and here’s the first look of the film.
Please Wait while comments are loading...