»   » దిల్ వాలె.... మహేష్ బాబు వెర్షన్! (రీమిక్స్)

దిల్ వాలె.... మహేష్ బాబు వెర్షన్! (రీమిక్స్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘దిల్ వాలె' మూవీ ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద డీసెంట్ బిజినెస్ చేసింది. ఆ సంగతి పక్కన పెడితే మహేష్ బాబు అభిమానులు కొందరు ‘దిల్ వాలె' మహేష్ బాబు వెర్షన్ రీమిక్స్ క్రియేట్ చేసి యూట్యూబ్ లో వదిలారు. మహేష్ బాబు అభిమానులను ఇది ఎంతగానో ఆకట్టుకుంటోంది. హీరో నాని ‘దిల్ వాలె మహేష్ బాబు వెర్షన్' ను స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసారు. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ఆయన ‘బ్రహ్మోత్సవం' చిత్రంలో నటిస్తున్నారు. సూపర్ హిట్ 'శ్రీమంతుడు' చిత్రం తర్వాత మహేష్‌ బాబు చేస్తున్న సినిమా 'బ్రహ్మోత్సవం' . పి.వి.పి. సినిమా పతాకంపై ఈ చిత్రం రూపొందుతున్న ఈ చిత్రానికి శ్రీకాంత్‌ అడ్డాల దర్శకుడు. న్యూ ఇయిర్ కానుకగా జనవరి 1న బ్రహ్మోత్సవం ఫస్ట్ లుక్ ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.

‘బ్రహ్మోత్సవం' ఆడియో రిలీజ్ ఫంక్షన్ కూడా హైదరాబాద్ లో కాకుండా తిరుపతిలో చేయాలని నిర్ణయించారు. బ్రహ్మోత్సవాలు అంటే ముందుగా మనకు గుర్తుకొచ్చేది తిరుపతి. అందుకే ఈ సినిమా ఫంక్షన్ ఇక్కడ నిర్వహించాలని డిసైడ్ చేసినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు సరసన సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, జయసుధ, రేవతి, నరేష్, రావు రమేష్, తనికెళ్ల భరణి, శుభలేఖ సుధాకర్, తులసి, ఈశ్వరీరావు, షాయాజీ షిండే, కృష్ణభగవాన్, రజిత, కాదంబరి కిరణ్, చాందిని చౌదరి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

DILWALE-Mahesh Babu Version Trailer Remix HD

ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : ఆర్.రత్నవేలు, సంగీతం : మిక్కీ జె. మేయర్, డాన్స్ : రాజు సుందరం, ప్రొడక్షన్ డిజైనర్ : తోట తరణి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సందీప్ గుణ్ణం, నిర్మాతలు : పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కథ,స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం : శ్రీకాంత్ అడ్డాల.

English summary
Watch this exclusive Mahesh Babu Dilwale Remix trailer.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu