»   » చూసి..ఆశ్చర్యపొండి :మహేష్-నాని కాంబినేషన్ ట్రైలర్ (వీడియో)

చూసి..ఆశ్చర్యపొండి :మహేష్-నాని కాంబినేషన్ ట్రైలర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్:సూపర్ స్టార్ మహేష్ బాబు, నాని కాంబినేషన్ ని ఊహించగలమా...అయితే అభిమానులు మాత్రం ఊహిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ హీరోగా వచ్చిన దిల్ వాలే చిత్రం తెలుగులో వీరిద్దరి కాంబినేషన్ లోచేస్తే ఎలా ఉంటుందని ట్రైలర్ రీమిక్స్ చేసి వదిలారు.

అదరకొట్టిన ఈ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడండి:

షారూఖ్ ఖాన్ చిత్రం దిల్ వాలే రిలీజై ..ఓకే అనిపించుకుంది. హిట్టైతే ఇక్కడ రీమేక్ చేసేవారేమో కానీ సినిమా నిరాసపరిచే ఫలితాన్ని ఇవ్వటంతో ఎవరూ ధైర్యం చేయలేదు. కానీ అలా కాదుగా..వారికి తోచినట్లు వారు రెచ్చిపోతూంటారు.

మహేష్, నాని, సమంత, కాజల్ నటించిన రకరకాల చిత్రాల్లోంచి విజువల్స్ తీసుకుని అదిరిపోయే రీతిలో ఈ ట్రైలర్ ని రెడీ చేసారు. తెలుగు వాయిస్ లేదు కానీ లేకపోతే నిజంగానే తెలుగు ట్రైలర్ వచ్చిందేమో అన్నంత ఫీల్ కలిగించారు. కాదంటారా.

ప్రస్తుతం మహేష్ బాబు..బ్రహ్మోత్సవం బిజీలో ఉన్నారు. బ్రహ్మోత్సవం తర్వాత మురుగదాస్ దర్శకత్వంలో తమిళ,తెలుగుభాషల్లో ఓ చిత్రం చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత శేఖర్ కమ్ములతో సినిమా ఉండే అవకాసం ఉందని తెలుస్తోంది.

English summary
Here is a special treat for the fans of Mahesh Babu and Nani as they can see both of them performing on the trailer of Shah Rukh Khan Starrer “Dilwale”.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu